Diabetes Control Tips: ఎన్ని ఔషధాలు వాడిన మధుమేహం నియంత్రణలో ఉండడం లేదా.. ఇలా చేస్తే 10 రోజుల్లోనే డయాబెటిక్ చెక్‌..!

Diabetes Control In 10 Days: ప్రస్తుతం చాలా మంది మధుమేహం వ్యాధితో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఆధునిక జీవన శైలికారణంగాను, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించదకపోవడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2022, 10:01 AM IST
  • మధుమేహం నియంత్రణలో ఉండడం లేదా..
  • జామ, కొబ్బరితో చేసిన జ్యూస్‌ తాగండి
  • మధుమేహం నియంత్రణలో ఉంటుంది
Diabetes Control Tips: ఎన్ని ఔషధాలు వాడిన మధుమేహం నియంత్రణలో ఉండడం లేదా.. ఇలా చేస్తే 10 రోజుల్లోనే డయాబెటిక్ చెక్‌..!

Diabetes Control In 10 Days: ప్రస్తుతం చాలా మంది మధుమేహం వ్యాధితో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఆధునిక జీవన శైలికారణంగాను, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించదకపోవడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ అనారోగ్య సమస్యకు ఇంకా శాస్త్రవేత్తలు నివారణకు సంబంధించిన ఔషధాలను కనుగొనలేదు. మార్కెట్‌ దీని నియంత్రణకు అనేక రకాల ఉత్పత్తులున్నా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. శరీరంలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ స్రవించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ తొలగిపోతుంది. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఆహారం పై శ్రద్ధ వహించకపోతే తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మనం సరైన ఆహారాన్ని ఎన్నుకోవడం మరియు క్రమం తప్పకుండా పాటించడం చాలా ముఖ్యం. దీని కోసం పలు రకాల పానీయాలు తాగాలని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వీరు పానీయాలను క్రమం తప్పకుండా తాగాలి:

జామ పండు జ్యూస్‌, కొబ్బరి నీళ్లు:

డయాబెటిక్ పేషెంట్ల జామ పండ్ల జ్యూస్‌, కొబ్బరి నీళ్లు వ్యాధి పై ప్రభావవంతంగా కృషి చేస్తాయి. ఈ పండ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్ర ఉంటుంది.  

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డయాబెటిక్ ఎలా నియంత్రణలో ఉంటుంది..?:

కొబ్బరి నీళ్లలో అధిక పరిమాణలంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో pH స్థాయిలను సమతుల్యం చేయ్యడమే కాకుండా.. జీవక్రియను కూడా పెంచుతుంది. అంతేకాకుండా సహజ చక్కెర కొబ్బరి నీళ్లలో లభిస్తుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రించి.. మధుమేహం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

జామ ఎలా రక్తంలో చక్కెరను స్థాయిని నియంత్రిస్తాయి:

జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మూలకాలుంటాయి. ఇది డయాబెటిక్ డైట్ యొక్క ప్రత్యేక లక్షణాలు.. అంతేకాకుండా ఈ పండుతో సోడియం, కేలరీలు కూడా అధికంగా ఉండవు. కావున వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి సులభంగా నియంత్రణలో ఉంటుంది.  అంతేకాకుండా ఇందులో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.

జామ, కొబ్బరి జ్యూస్‌ను ఎలా తయారు చేయాలి?

1. ముందుగా 2 నుంచి 3 జామపండ్లను తొక్క తీసి.. దాని గుజ్జును మిక్సీ గ్రైండర్‌లో వేసి.. వడకట్టి విత్తనాలను వేరు చేయాలి.
2.  ఆ తర్వాత దీనిలో ఒకటిన్నర గ్లాసుల కొబ్బరి నీళ్లను కలపండి. ఇప్పుడు నిమ్మరసం, ఒక చిన్న చెంచా అల్లాన్ని వేసి తీసుకోవాలి.
3. రుచిని పెంచుకోవడానికి తులసి ఆకులను మెత్తగా కోసి ఆల్పాహారానికి ముందు తాగండి

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also read: World Emoji Day: నేడే ప్రపంచ ఎమోజీ దినోత్సవం.. ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారో తెలుసా..!

Also read:  Beard Growing Tips: మీకూ ఒత్తైనా గడ్డం రావాలంటే ఇలా చేయండి.. నెలలోనే స్ట్రాంగ్‌ బియర్డ్‌ వస్తుంది..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News