Diabetes Do Not Eat these Foods: డయాబెటిస్ తో బాధపడున్న వారికి తీపి తినటం అంటే అది విషంతో సమానం. అయితే చాలా మంచి మధుమేహం ఉందని మర్చిపోయి విచ్చల విడిగా తీపితో కూడా ఆహారాలు తీసుకుంటున్నారు. దీంతో గ్లూకోజ్ స్థాయి నియంత్రణ తప్పి కొందరిలో ప్రాణాంతకంగా మారుతుంది. మరి కొందరిలో ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోజూ తీసుకునే ఆహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీవ్ర మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది.
ఈ ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది:
టమోటా సాస్:
టమోటా సాస్ ఆహారాల రుచిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది బేకరీ ఆహార పదార్థాలపై కెచప్ వినియోగించి తీసుకుంటారు. కాబట్టి ఈ సాస్‌ను తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకుంటే.. గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి కారణమయ్యే చక్కెర కంటెంట్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం సమస్యలకు దారీ తియోచ్చు.
అధిక చక్కెర పండ్లు:
తాజా పండ్లను శరీర ఆరోగ్యంగా ఉండడానికి తరచుగా ఆహారాల్లో తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని పండ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. మామిడి, పైనాపిల్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు వీటిని తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాఫీ:
కాఫీలో కెఫిన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది రక్తపోటును పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చు. కాబట్టి ప్రతి రోజూ కాఫీ తాగకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్ వ్యాధి గ్రస్తులు అస్సలు తాగకపోవడం చాలా మంచిది.
రుచి గల పెరుగు:
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పలువురు నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ పెరుగును వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచొచ్చు. అంతేకాకుండా పలు వ్యాధులకు కూడా దారి తీసే ఛాన్స్ ఉంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook