Diet For Weight Loss: బరువు తగ్గడానికి ఎన్నో రకాల చిట్కాలను తరచుగా పాటిస్తూ ఉంటారు. మరికొందరైతే కఠిన తరమైన వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేక పోతారు. ఇకనుంచి కఠినతరమైన వ్యాయామాలు చేయకుండా.. ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాను పాటించడం వల్ల సులభంగా వేగంగా బరువు తగ్గొచ్చు. ఎలాంటి చిట్కాలను వినియోగించడం వల్ల బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి సోంపు తో తయారు చేసిన కొన్ని రకాల పదార్థాలు, పానీయాలు సులభంగా శరీర బరువును నియంత్రిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును నియంత్రించడమే కాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి శరీరాన్ని కూడా కాపాడుతాయని వారు తెలుపుతున్నారు.
సోంపుతో తయారుచేసిన నీటిని ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు దూరం అవ్వడమే కాకుండా.. సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి సోంపు గింజలను నానబెట్టిన నీరు ప్రభావవంతంగా సహాయపడుతుంది.
వేయించిన సోంపును తినడం వల్ల కూడా శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గించుకొని బరువు తగ్గొచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను కూడా నియంత్రించేందుకు సహాయపడుతుంది.
సోంపుతో తయారు చేసిన టీ కూడా శరీర బరువును తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం, పొట్ట సమస్యలు, జీవక్రియ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు సోంపుతో తయారుచేసిన టీని తాగాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.
సోంపు టీ తయారు చేయడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన టిప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల నీటిని వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే ఐదు టీ స్పూన్ల సోంపు గింజలను వేసుకొని రెండు టీ స్పూన్ల తేనెను కూడా వేసుకోవాలి. వీటిని 15 నిమిషాల పాటు మరిగించి వడకట్టుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు లభించడమే కాకుండా.. వేగంగా బరువు తగ్గుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook