Wrong Combination With Lemon: నిమ్మకాయతో ఈ 8 ఆహారాలు కలిపి తినకూడదు.. ఎందుకో తెలుసా?

Wrong Combination With Lemon: నిమ్మకాయలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని రుచి కూడా పుల్లగా ఉంటుంది. అయితే, కొన్ని ఆహారాలతో కలిపి తీసుకుంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 26, 2024, 04:11 PM IST
Wrong Combination With Lemon: నిమ్మకాయతో ఈ 8 ఆహారాలు కలిపి తినకూడదు.. ఎందుకో తెలుసా?

Wrong Combination With Lemon: నిమ్మకాయలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని రుచి కూడా పుల్లగా ఉంటుంది. అయితే, కొన్ని ఆహారాలతో కలిపి తీసుకుంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఆహారాలతో కలిపి నిమ్మకాయను అస్సలు తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.

స్పైసీ ఫుడ్..
నిమ్మకాయ యాసిడిక్ లక్షణం కలిగి ఉంటుంది. ఇది స్పైసీ ఫుడ్‌తో కలిపి తీసుకోవడం వల్ల వేడి పుడుతుంది. అతిగా స్పైసీగా ఉండే ఆహారాలతో వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత దిగజారుతుంది.  ఈ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది.

పాల పదార్థాలు..
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే కడుపులో యాసిడిక్ రియాక్షన్ అవుతుంది. అంతేకాదు పాలు, పాల పదార్థాలతో కలిపి నిమ్మకాయను తీసుకోవడం వల్ల గుండెలో తీవ్రంగా మంట పుడుతుంది.

ఇదీ చదవండి: ఎండకాలం తరచూ మజ్జిగ తాగుతున్నారా? ఈ సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు జాగ్రత్త..

రెడ్ వైన్..
రెడ్ వైన్ ఆధారిత ఫుడ్స్ తో నిమ్మకాయ తీసుకోవడం వల్ల యాసిడ్ రియాక్షన్ ఏర్పడుతుంది. రెడ్ వైన్ ఆధారిత సాస్ కూడా తీసుకోకూడదు.

ఆల్కలైన్ కూరగాయలు..
సాధారణంగా నిమ్మకాయ యాసిడిక్ లక్షణం కలిగి ఉంటుంది. పాలకూర వంటి ఆల్కలైన్ ఉన్న ఆకుకూరలతో కలిపి తీసుకోకూడదు. ఈ ఆకుకూరలు నల్లగా మారిపోతాయి. వీటితో కలిపి తినాలంటే తినే కొద్దిసేపు ముందు నిమ్మకాయను పిండుకుని తీసుకోవాలి.

మసాలాలు..
నిమ్మకాయలో సిట్రిక్ ఫ్లేవర్ గాఢంగా ఉంటుంది. దీన్ని మసాలాతో కలిపి తీసుకోకూడదు. అంటే యాలకులు, లవంగాలు ఉన్న ఆహారంలో కలపకూడదు. ఇలా స్పైసీ ఉండే ఆహారంలో మీకు లెమన్ కలిపి తీసుకోవాలంటే కాస్త తక్కువ మొత్తంలో వేసుకోవాలి. 

తీపిపండ్లు..
నిమ్మకాయ రుచి పులుపుగా ఉంటుంది. ఇది తీపి పండ్లను ప్రభావితం చేస్తుంది. పుచ్చకాయ, స్ట్రాబెర్రీలతో కలిపి తీసుకోకూడదు. వీటి రుచి పెరగాలంటే తేనెను కలిపి తీపి పదార్థాలను తీసుకోవాలి.

ఇదీ చదవండి: బెండకాయను ఇలా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో 3వది అస్సలు మిస్సవ్వకండి..

రెడ్ వైన్..

సముద్రపు ఆహారాలు..
సముద్రపు ఆహారాల్లో కూడా నిమ్మకాయ వేసి తినకూడదు. ఇది అన్నిసార్లు వర్కౌట్ అవ్వుదు. కొన్నిసార్లు ఇది యాసిడ్ రియాక్షన్ వస్తుంది. అందుకే అన్నీ ఆహారాలతో కలిపి తీసుకోకూడదు నిమ్మకాయ.

మజ్జిగ..
పాల వలె నిమ్మకాయను మజ్జిగతో కూడా కలిపి తీసుకోకూడదు. మజ్జిగ, నిమ్మకాయతో కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల యాసిడిక్ రియాక్షన్ ఏర్పడుతుంది. దీంతో నిమ్మకాయ మన కడుపులో యాసిడ్ రియాక్షన్ చేస్తుంది. దీంతో కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News