Drumstick Curry For Weight Loss: సాంబార్‌కు రుచిని అందించడానికి డ్రమ్ స్టిక్ కీలక పాత్ర పోషిస్తుంది. మునగ కాయల్లో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, జింక్ అధిక పరిమాణంలో లభిస్తాయి. మునగ కాయలే కాకుండా శరీరానికి చెట్టు వేరు, ఆకులు కూడా శరీరానికి సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల సులభంగా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. మునగ కాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మునగ ప్రయోజనాలు:
బరువు తగ్గడం:
మునగ కాయ సాంబార్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడమేకాకుండా స్థూలకాయాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్, యాంటీ ఒబెసిటీ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా శరీర బరువును నియంత్రిస్తుంది.
మధుమేహం:
మునగ గింజలు, బెరడు, ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మధుమేహం సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా వీటిని ఆహారంతో తీసుకోవాల్సి ఉంటుంది. మునగలో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రిస్తుంది.
రోగనిరోధక శక్తి పెంచుతుంది:
మునగ ఆకుల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. క్రమం తప్పకుండా వీటి ఆకులను ఆహారంలో తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సులభంగా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
వాపు:
మునగలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు ఆర్థరైటిస్ నొప్పులను కూడా సులభంగా తగ్గిస్తుంది. గాయం, ఇన్ఫెక్షన్స్ సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి