Dry Fruits For Diabetic Patients: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం దృఢంగా అవ్వడమేకాకుండా రక్తంలో చెక్కెర పరిమాణాలు కూడా సుభంగా తగ్గుతాయి. ఇందులో ఉండే మూలకాలు హిమోగ్లోబిన్‌ను పెంచడమేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. కాబట్టి రక్త హీనత ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్ల విషయానికి వస్తే.. వారు వీటిని ఇలా ఆరోగ్య నిపుణులు సూచించినట్లు ఆహారాల్లో వినియోగిస్తే చక్కెర వ్యాధికి చెక్ పెట్టొచ్చు.
తీపి పండ్లతో జాగ్రత్తగా ఉండండి:
డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీపిగా ఉన్నవాటిని తక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీటిని తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తీపిగా ఉన్న డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలున్న అవి రక్తంలో చక్కెర పరిమాణాలు పెంచే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా తీపి ఎక్కువగా ఉండే వాటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఎండు ద్రాక్ష, అంజీర, ఖర్జూరం మొదలైన వాటిని తినపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పరిమితంగా తినాలి:
ఏదైనా ఒక పరిమితిలో తీసుకున్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరమని చాలా మంది వాటిని విచ్చల విడిగా తీసుకుంటున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు వీటిని ఒక పిడికిలి కంటే ఎక్కువగా తినకూడదు. వీరు ఈ డ్రై ఫ్రూట్స్ నీటిలో నానబెట్టి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేయించిన డ్రై ఫ్రూట్స్:
చాలా మంది వేయించిన డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. దీని వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలగవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కావాలనుకుంటే వీటిని నెయ్యిలో వేయించి తీసుకోవచ్చని.. సహజంగా వేయించిన వాటిని తీసుకోకూడదని నిపుణులు భావిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్‌ను వేయించడం వల్ల పోషకాలు శరీరానికి అందకపోవచ్చు. అంతేకాకుండా వీటిలో ఉండే పోషకాలు కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని వేయించి తీసుకోవడం మానుకోవాని ఆరోగ్య నిపుణలు తెలుపుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు వేయించి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE TELUGU NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్
Also Read : Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి