Easy weight loss tips Top five tips to lose weight effortlessly : చాలా మంది బరువు తగ్గే విషయంలో కాస్త ఇబ్బందులుపడుతుంటారు. జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేస్తూ.. డైట్ (Diet) పాటిస్తూ బరువు తగ్గేందుకు కష్టపడుతూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి జిమ్ములో గంటల తరబడి కసరత్తులు చేయాల్సిన పని లేదు... కొన్ని చిన్న చిట్కాలతో (easy tips) ఈజీగా వెయిట్ లాస్ (weight loss) అవ్వొచ్చు.
నిద్రలేచాక రెండు గంటలల్లోపే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి :
బ్రేక్‌ఫాస్ట్‌ను (Breakfast) అస్సలు స్కిప్ చేయకండి. ఉదయం లేచిన తర్వాత రెండు గంటల్లోపు బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మంచిది. బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ (Skip Breakfast) చేస్తే శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్ సరైన సమయంలో తీసుకుంటే బరువును అదుపులో పెటొచ్చు.
యాపిల్స్ ఎక్కువగా తినాలి :
యాపిల్స్ లో (Apples) ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యాపిల్స్ ఎక్కువగా తినడం మంచిది. దీంతో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడకుండా ఉంటారు. అలాగే బరువు తగ్గించడానికి కూడా యాపిల్ (Apple) చాలా ఉపయోగపడుతుంది. ఏవేవో స్నాక్స్ తినే బదులు యాపిల్‌ను తీసుకోవడం చాలా మేలు.
నీళ్లు ఎక్కువగా తాగాలి :
హైడ్రేషన్ (Hydration) ఎంత ఎక్కువగా ఉంటే బాడీకి అంత మేలు. అందువల్ల నీళ్లు ఎక్కువగా తాగాలి. ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీరు (Eight glasses of water) తాగితే చాలా ప్రయోజనాలుంటాయి. ఇలా చేయడం జీర్ణక్రియ మెరగవుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే బరువు నియంత్రణలో ఉంటుంది.
ఇక ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ తేనె వేసి, కాస్త నిమ్మరసం కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇక భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం మంచిది.
చిన్న ప్లేట్లు ఉపయోగించండి:
మీరు భోజనం చేసేటప్పుడు లేదా స్నాక్స్ తీసుకునేటప్పుడు చిన్న ప్లేట్లు (smaller plates) ఉపయోగించడం మేలు. దీంతో మీరు భోజనాన్ని తగిన మోతాదులో తీసుకోగలుగుతారు. ఒక ప్లేట్ భోజనం చేశాక.. మీకు కాస్త ఎక్కువ తిన్నామనే భావన ఏర్పడుతుంది. ఈ ట్రిక్‌తో బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
Also Read : Rohit Sharma Captaincy: కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ- వెండీస్ సిరీస్ కు సిద్ధమైన రోహిత్ శర్మ
సస్టైనబుల్ డైట్స్ : బరువు తగ్గాలంటే ఒకేరకమైన డైట్ (sustainable diets) పాటించాలి. దీర్ఘకాలం పాటు ఒకే రకమైన డైట్ పాటిస్తే బరువు నియంత్రణలో ఉంటుంది. తరుచూ డైట్ మార్చడం సరికాదు.. దీంతో బరువు (weight) పెరిగే అవకాశం ఉంటుంది.
Also Read : Jai Bhim Oscar Youtube: ఆస్కార్ యూట్యూబ్ లో ప్రదర్శించిన తొలి తమిళ చిత్రంగా జై భీమ్ ఘనత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook