Blood Pressure
గుండె రక్తాన్ని పంప్ చేసే వేగాన్ని రక్తపోటు అని అంటారు. మన శరీరం యాక్టివ్ గా ఉండాలి అన్నా ,అవయవాలు సరిగ్గా పని చేయాలి అన్నా రక్తం సరియైన మోతాదులో స్పీడ్ తో మన బాడీలో మూవ్ అవుతూ ఉండాలి. ఇందులో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా అది శరీరం పైనే కాదు మన ఆరోగ్యం పై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉండడం అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే దీని తగ్గించుకోవడానికి చాలా మంది ఎక్కువగా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అయినా కానీ కొన్ని సందర్భాలలో ఇది కంట్రోల్ కాదు.
మన జీవనశైలిలో చేసుకొనే చిన్ని మార్పులు, ఆహారం విషయంలో తీసుకునే కొద్దిపాటి శ్రద్ధ ఇటువంటి ఎన్నో సమస్యలను నియంత్రించగలదు. హై బిపిని మందులు వేసుకోవలసిన అవసరం లేకుండా కొన్ని వ్యాయామాల ద్వారా సులభంగా అదుపులో పెట్టవచ్చు. ఇది మనం ఎక్కడైనా చేసుకోదగిన వ్యాయామాలే.. కాబట్టి వీటిని ఆచరించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఆ వ్యాయామాలు ఏమిటో తెలుసుకుందామా..
ఏరోబిక్స్
ఏరోబిక్స్ చేయడం వల్ల కుండే ఆరోగ్యంగా ఉండడం తో పాటు బలంగా మారుతుంది. కార్డియో వ్యాయామం రెగ్యులర్ గా చేసే వారికి శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరగి,రక్త నాళాలపై ఒత్తిడి పెరిగి అవి ఎటువంటి బ్లోకేజ్ లు లేకుండా ఉంటాయి. అలాగే ఏరోబిక్స్ చేసేవారికి ఓవర్ వెయిట్, వెన్నునొప్పి , మెడనొప్పి లాంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. వారంలో కనీసం నాలుగు సార్లు రోజుకి 30 నిమిషాలు ఏరోబిక్స్ ను మీ జీవన శైలిలో భాగంగా చేసుకోవడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.
స్విమ్మింగ్
ఓవరాల్ బాడీ ఫిట్నెస్ కి అద్భుతంగా పనిచేసే మరొక ఎక్ససైజ్ స్విమ్మింగ్. మిగిలిన వ్యాయామాలు చేసేటప్పుడు శరీరం అలసిపోయిన భావన కలుగుతుంది కానీ స్విమ్మింగ్ అనేది శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు మనసుని ఉత్తేజపరుస్తుంది. హాయిగా అలా నీటిపై తేలిపోతుంటే మన మనసులో స్ట్రెస్ కూడా అదే మాదిరి అలా అలా ..వెళ్లిపోతుంది. స్విమ్మింగ్ రెగ్యులర్ గా చేసే వారికి అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, బాడ్ కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు తలెత్తవు. అంతేకాదు వీరి స్కిన్ ఎంతో ఫ్రెష్ గా యంగ్ గా ఉంటుంది.
బ్రిస్క్ వాక్
వాకింగ్ చేయడం అనేది మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమైనటువంటి ఎక్ససైజ్. జిమ్ కి వెళ్లి డబ్బులు కట్టి మరీ గంటలు తరబడి కష్టపడాల్సిన పని లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా సులభంగా చేసుకోదగిన ఎక్ససైజ్ వాకింగ్. చాలామంది ఫోన్ మాట్లాడుతూ లేక పక్కన వాళ్ళతో సొల్లు కొడుతూ చిన్నగా నడిచి మేము వాకింగ్ చేసేసాము అని అనుకుంటారు. కానీ నిజానికి వాకింగ్ చేయాల్సిన పద్ధతిలో చేయకపోతే ఎంత చేసినా ఫలితం ఉండదు.
ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాల వరకు బ్రిస్క్ వాకింగ్ చేయాలి. అలాగని గబగబా హడావిడిగా నడవాల్సిన పనిలేదు. మీ శరీరం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో మీ బలం ఎంత ఉందో దాన్ని బట్టి మీ బ్రిస్క్ వాకింగ్ స్పీడ్ ని సెట్ చేసుకోండి. ఇక వాకింగ్ చేసే సమయంలో శ్వాస మీద ధ్యాస పెట్టాలి.. ఊరికే మాట్లాడుతూ వాకింగ్ చేయడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. రోజుకు కనీసం 25 నుంచి 30 నిమిషాల పాటు చురుకుగా నడిచే వ్యక్తులకు రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా శరీరంలో అధిక బరువు సమస్య తలెత్తదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.