Unhealthy breakfast: బ్రేక్ ఫాస్ట్ గా అస్సలు తీసుకోకూడని పదార్థాలు ఏవో తెలుసా ?

Breakfast: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. ఉదయాన్నే తీసుకునే ఆహారం మన ఆరోగ్యం లో చాలా మార్పులు తీసుకొస్తుంది. కానీ ఉదయం తీసుకునే ఆహారంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి. మరి ఉదయం తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2023, 12:01 PM IST
Unhealthy breakfast: బ్రేక్ ఫాస్ట్ గా అస్సలు తీసుకోకూడని పదార్థాలు ఏవో తెలుసా ?

Foods to avoid: ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ రాజుల తీసుకోమంటారు. ఎందుకంటే ఉదయం మనం తినే ఫుడ్ మన శరీరానికి ఎంతో లాభం చేకూరుస్తుంది. రాత్రి దాదాపు 9 గంటలు తినకుండా ఉంటాం కాబట్టి మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కొంతమంది ఉదయం లేవగానే ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుండా ఉంటే కూడా ప్రమాదమే. అలా అని ఏమి తీసుకోవాలో తెలియకుండా ఏది పడితే అది తిన్నా కూడా మంచిది కాదు. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.. ఎలాంటివి తినకూడదో ఒకసారి చూద్దాం..

 స్పైసీ ఫుడ్

చాలా మంది ఉదయం లేవగానే స్పైసీ ఆహారాలను తీసుకుంటారు. కానీ మన బ్రేక్ ఫాస్ట్ గా స్పైసీ ఫుడ్స్ అసలు తీసుకోకూడదు. ఈమధ్య ఉదయనే బిర్యాని అనే కాన్సెప్ట్ ఇంస్టాగ్రామ్ లో కూడా చూస్తున్నాం. కానీ అలాంటి ఫుడ్ ఉదయాన్నే తీసుకోవడం వల్ల కడుపులో మంట ఏర్పడి కడుపునొప్పి గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ గా స్పైసీ ఫుడ్స్ పక్కన పెట్టడం మంచిది.

ఫ్లేవర్డ్ పెరుగులు

ఈమధ్య బ్రేక్‌ఫాస్ట్‌లో పెరుగుకు బదులుగా ఫ్లేవర్డ్ పెరుగులని తినే ట్రెండ్ పెరిగింది. కానీ ఇవి ఉదయాన్నే తీసుకోవడం వల్ల చాలా ప్రమాదం ఉంది. ఈ ఫుడ్ ఐటమ్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. కాబట్టి ఇవి ఉదయాన్నే తీసుకోకపోవడం ఉత్తమం.

ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్

ఉదయాన్నే చాలామంది జ్యూసులు తీసుకోవడం మంచిదే అనుకుంటూ స్వచ్ఛమైన పండ్లతో జ్యూస్ తీసుకోకుండా.. మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన పండ్ల రసాలను తాగుతున్నారు. మనం పండ్లు తెచ్చుకొని వాటిని జ్యూస్ చేసుకుని తాగితే మంచిదే కానీ.. ఇలా ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూస్ మాత్రం అసలు మంచిది కాదు. ఈ జ్యూస్‌లలో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్‌లు, షుగర్ ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి కాబట్టి ఈ అలవాటును మార్చుకోవడం ఉత్తమం.

బ్రెడ్ ..జామ్

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా చాలా ఈజీగా అయిపోయేది బ్రెడ్ ..జామ్…కాబట్టి దానిని తినడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. అయితే బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ ..జామ్
 తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది.. ఇక అదే విధంగా డిప్రెషన్ మానసికంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం 

సిట్రస్ ఫ్రూట్స్

ఫ్రూట్స్ మంచివే అయినా కొన్ని ఫ్రూట్స్ కొన్ని టైమ్స్ లో తీసుకోకపోవడం ఉత్తమం. ఉదయాన్నే సిట్రస్ ఫ్రూట్స్ అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఎసిడిటి అల్సర్ గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News