గ్యాస్ సమస్యే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది అత్యంత ప్రమాదకరమైన కేన్సర్ సంకేతం కావచ్చుంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం.
కడుపులో గ్యాస్ అనేది సాధారణమైపోయింది. జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల కడుపు బరువుగా ఉన్నట్టుంటుంది. గ్యాస్ కారణంగా కడుపు నొప్పి కూడా ఉంటుంది. గ్యాస్, కడుపు నొప్పికి గంబీరమైన వ్యాధులు కారణం కావచ్చు. కడుపులో గ్యాస్‌కు కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి కారణం కావచ్చు. స్లీప్ యాప్నియా, హైపో థైరాయిడిజమ్, స్వెల్లింగ్, మలబద్ధకం సమస్యల కారమంగా కడుపులో నొప్పి అనేది ఉంటుంది.
కడుపు కేన్సర్
గ్యాస్ ఉంటే కడుపు నొప్పి సమస్య కూడా తలెత్తుతుంది. కడుపు కేన్సర్‌కు కూడా ఇదే లక్షణం ఉంటుంది. కడుపు కేన్సర్ ఉన్నప్పుడు గ్యాస్, కడుపు ఉబ్బరంగా ఉండటం, నొప్పి వంటి సమస్యలుంటాయి.కేన్సర్ ఉంటే రెక్టల్ బ్లీడింగ్ సమస్య కూడా ఉంటుంది. కడుపు కేన్సర్ లక్షణాన్ని పట్టించుకోకపోతే ప్రాణాంతకం కావచ్చు.
హైపోథైరాయిడిజమ్
హైపోథైరాయిడిజమ్ ఉంటే జీర్ణానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. దీనివల్ల కడుపు, ప్రేవులు ప్రభావితమౌతాయి. ఫలితంగా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు ఉంటాయి. దీంతోపాటు గొంతులో నొప్పి ఉన్నా థైరాయిడ్ కావచ్చు.
స్లీప్ యాప్నియా
స్లీప్ యాప్నియా ఉంటే ఆ వ్యక్తి ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటాడు. స్లీప్ యాప్నియా కారణంగా గురక వస్తుంది. ఫలితంగా కడుపులో గ్యాస్, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. రోజూ గ్యాస్ సమస్య ఉంటే స్లీప్ యాప్నియా కావచ్చు. ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలవు.
ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్
ఈ వ్యాధి ఉన్నప్పుడు కడుపులో మలబద్ధకం, స్వెల్లింగ్ వంటి లక్షణాలుంటాయి. ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్ ఉంటే జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. ఈ రకమైన సమస్య ఉంటే వెంటనే చికిత్స చేయించాల్సి ఉంటుంది.
Also read; Weight Loss Diet: స్వీట్ పొటాటోతో కేవలం 7 రోజుల్లో శరీర బరువుకు ఇలా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook