Green Tea: ప్రస్తుతం గ్రీన్ టీ తాగడం ట్రెండ్ గా మారింది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీలను తాగుతున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దీనిని ప్రతి రోజు తాగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల లాభాలే కాకుండా చాలా రకాల దుష్ప్రభావాలు కూడా కలుగుతాయని ఇటీవల ఆరోగ్య నిపుణులు ఓ అధ్యయనంలో తేలింది. గ్రీన్ టీ ని అతిగా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆ ధ్యానంలో తేల్చి చెప్పారు. గ్రీన్ టీ అతిగా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు:
పొట్ట సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ మసలతో బాధపడుతున్న వారు గ్రీన్ టీ ని తాగడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జీర్ణ సమస్యలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని.. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు గ్రీన్ టీ ని తాగకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో:
గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగడం హానికరం. ఇందులో కెఫిన్, టానిక్ యాసిడ్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజు తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా గర్భాధారణ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
రక్తహీనత:
గ్రీన్ టీ తాగడం వల్ల ఐరన్ శోషణను తగ్గించే చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి రక్తహీనత సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రలేమి సమస్య:
గ్రీన్ టీలో కెఫిన్ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల రాత్రిపూట నిద్రలేమి సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొందరిలో ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు గ్రీన్ టీజీ దూరంగా ఉండటమే చాలా మంచిది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు
ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook