చాలామంది దినచర్య టీతో ప్రారంభమౌతుంది. కానీ ఒకవేళ మీరు టీ స్థానంలో గ్రీన్ టీతో దినచర్య ప్రారంభిస్తే ఆరోగ్యపరంగా చాలా లాభదాయకమంటున్నారు ఆరోగ్య నిపుణులు. బహుశా అందుకే ఇటీవలి కాలంలో గ్రీన్ టీ క్రేజ్ పెరుగుతోంది.
గ్రీన్ టీ అనేది ఓ ఔషధంలా ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది టీ కంటే గ్రీన్ టీ తాగడాన్ని ఇష్టపడుతున్నారు. గ్రీన్ టీ అనేది కేవలం బరువు తగ్గించేందుకే కాదు..ఆరోగ్యపరంగా చాలా రకాల ప్రయోజనాల కోసం తాగాల్సి ఉంటుంది. గ్రీన్ టీ లో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా..చాలా వ్యాధుల ముప్పు తొలగిపోతుంది. గ్రీన్ టీతో కలిగే ఇతర ప్రయోజనాలు పరిశీలిద్దాం..
అధిక బరువుకు చెక్
గ్రీన్ టీ బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయం తాగితే శరీరాన్ని ఎనర్జీ లభిస్తుంది. అదనంగా ఉన్న కేలరీలు బర్న్ అవుతాయి. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పరగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
గుండె వ్యాధులు దూరం
గుండె రోగాల్ని నయం చేయడంలో గ్రీన్ టీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాఫీ లేదా టీ తాగే అలవాటుంటే..గ్రీన్ టీ తాగడం మంచిది. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గడంలో దోహదపడుతుంది. గ్రీన్ టీ క్రమం తప్పకుండా రోజూ సేవిస్తే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తొలగిపోతుంది.
డయాబెటిస్ నియంత్రణ
డయాబెటిస్ నియంత్రించడంలో గ్రీన్ టీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ప్రయోజనం కలుగుతుంది. డయాబెటిస్ రోగులు గ్రీన్ టీను డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
గ్రీన్ టీ మెదడుకు చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. మెదడును యాక్టివ్‌గా ఉంచేందుకు దోహదమౌతుంది. గ్రీన్ టీ వల్ల మెదడుకు తాజాదనం లభిస్తుంది.
ఎముకలకు బలం
గ్రీన్ టీలో ఉండే పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి. ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పు తొలగిపోతుంది.
Also read: Green Tea: అతిగా గ్రీన్ టీని తాగుతున్నారా.. ఈ వ్యాధులన్నవారు అస్సలు తాగొద్దు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook