Hair Care Tips: ఆధునిక జీవనశైలిలో ఎదుర్కొంటున్న పలు సమస్యల్లో ఒకటి హెయిర్‌ఫాల్. ఈ సమస్య చెడు జీవనశైలి, ఒత్తిడి కారణంగా ఎదురౌతుంటుందనేది అందరికీ తెలిసిందే. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాల షాంపూలు, కండీషనర్లు వినియోగిస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సాధారణంగా హెయిర్‌ఫాల్ సమస్య ప్రారంభమైందంటే అంత త్వరగా విముక్తి పొందడం అసాధ్యం. మీక్కూడా ఇదే సమస్య బాధిస్తుంటే వెల్లుల్లి సహాయం తీసుకోవల్సి ఉంటుంది. హెయిర్‌ఫాల్ సమస్యను అరికట్టేందుకు వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతుందనేది తెలుసుకుందాం..
వెల్లుల్లితో తేనె
వెల్లుల్లి, తేనె సహాయంతో హెయిర్‌ఫాల్ సమస్యను దూరం చేయవచ్చు. దీనికోసం 10 వెల్లుల్లి రెమ్మల్ని, ఒక స్పూన్ తేనె తీసుకోవాలి. వెల్లుల్లిని రుబ్బి అందులో తేనె కలిపి కుదుళ్లకు పట్టేలా రాసుకోవాలి. 20 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తరువాత మైల్డ్ షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హెయిర్‌ఫాల్ సమస్య నుంచి త్వరగా గట్టెక్కవచ్చు.
వెల్లుల్లి అల్లం
వెల్లుల్లి అల్లం కలిపి రాయడం వల్ల హెయిర్‌ఫాల్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. దీనికోసం అల్లం ముక్కలు, 6 వెల్లుల్లి రెమ్మలు తీసుకుని బాగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడిచేయాలి. ఆ తరువాత ఇందులో వెల్లుల్లి, అల్లం మిశ్రమాన్ని కలిపి జుట్టుకు రాసి తేలిగ్గా మస్సాజ్ చేయాలి. ఈ ప్రక్రియ మంచి ఫలితాలనిస్తుంది.
వెల్లుల్లి ఉల్లిపాయలు
ఉల్లిపాయ కేశాలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. 2 వెల్లుల్లి రెమ్మల్ని, ఉల్లిపాయల్ని తీసుకుని నీళ్లలో కాస్సేపు ఉడికించాలి. చల్లారిన తరువాత ఆ నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రక్రియతో హెయిర్‌ఫాల్ సమస్యను అరికట్టవచ్చు.
Also read: Cucumber Benefits: కీరాను తొక్కతో తింటే ఏమౌతుంది, ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook