Sprouts Health Tips: హెల్తీ డైట్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. దినచర్య ప్రారంభం స్ప్రౌట్స్‌తో జరిగితే..ఏ విధమైన అనారోగ్యం దరిచేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
స్ప్రౌట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. ధాన్యం, పప్పుల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. స్ప్రౌట్స్ ఇందుకు బాగా దోహదపడతాయి. శరీరానికి అన్ని రకాల న్యూట్రియంట్ల లోపం పూడ్చాలంటే సోయాబీన్, పెసర వంటివాటిని రోజంతా నానబెట్టి తినాలి. ఇందులో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పెసర, సోయాబీన్స్, మోఠ్‌లలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి మినరస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ సేవించడం వల్ల విటమిన్స్, మినరల్స్ లోపం పూర్తవుతుంది. స్ప్రౌట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
స్ప్రౌట్స్ రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ కచ్చితంగా పెరుగుతుంది. పోషక పదార్ధాలతో నిండిన ధాన్యాల్ని తీసుకోవడం వల్ల రోగాలతో పోరాడే శక్తి వస్తుంది. వాతావరణం మారిన ప్రతిసారీ ఆరోగ్యం పాడవదు.
మోఠ్, సోయాబీన్, పెసరలో విటమిన్స్, మినరల్స్ తగిన మోతాదులో ఉంటాయి. ఇందులో మెగ్నీషియం కూడా లభిస్తుంది.రోజూ వీటి స్ప్రౌట్స్ తినడం వల్ల మజిల్స్ పటిష్టంగా మారతాయి. మజిల్ పెయిన్స్ దూరమౌతాయి. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ కారణంగా మలబద్ధకం వంటి సమస్య కూడా దూరమౌతుంది.
సోయాబీన్, పెసర, మోఠ్ స్ప్రౌట్స్ తినడం చర్మానికి చాలా మంచిది. ముఖంపై పింపుల్స్, ముడతలు కూడా దూరమౌతాయి.నానబెట్టి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాల్ని మెరుగుపరుస్తాయి. స్ప్రౌట్స్ అనేవి కేవలం ఆరోగ్య పరిరక్షణకే కాకుండా బరువు తగ్గించేందుకు కూడా దోహదపడతాయి.
Also read: Antibiotics: ఈ సమస్యలున్నవారు యాంటీ బయోటిక్స్ వాడకూడదు, కిడ్నీ రోగులు తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook