Health Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో మనిషి ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చాలా వరకూ సమస్యల్ని ప్రకృతిలో లభించే పదార్ధాలు లేదా పండ్లతోనే దూరం చేయవచ్చంటారు ఆరోగ్య నిపుణులు. అలాంటిదే ఆరెంజ్. ఆరోగ్యపరంగా అద్భుతమైంది.
ఆరెంజ్. చూడగానే తినాలన్పించే రుచి కలిగి ఉంటుంది. రుచిలోనే కాదు ఆరోగ్యపరంగా కూడా అంతే ప్రయోజనాలున్నాయి. ప్రస్తుతం ఆరెంజ్ సీజన్ నడుస్తోంది. రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా రకాల వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు. ఇందులో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. శరీరంలోని అన్నిఅంగాల్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ సి అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది. అందుకే విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆరెంజ్ తినడం వల్ల శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ అత్యంత వేగంగా పెరుగుతుంది.
ఆరెంజ్ క్రమం తప్పకుండా రోజూ తినడం వల్ల ఎనీమియా సమస్య నుంచి కాపాడుకోవచ్చు. ఇటీవలి కాలంలో చాలామందిలో రక్త హీనత ప్రధాన సమస్యగా కన్పిస్తోంది. ఆరెంజ్ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తలెత్తదు. ఫలితంగా ఎనీమియా ముప్పు దూరమౌతుంది.
ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మనిషి శరీరంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంపై ఏ విధమైన మచ్చలు, డార్క్ సర్కిల్స్ లేకుండా చేస్తాయి. చర్మానికి నిగారింపు ఇస్తూ యౌవనంగా ఉంచుతుంది. రోజూ ఆరెంజ్ తినడం వల్ల ముఖంపై నిగారింపు వస్తుంది.
ఆరెంజ్‌ను చాలామంది బరువు తగ్గించే ప్రక్రియకు ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ మోతాదు చాలా ఎక్కువ. దాంతోపాటు వాటర్ కంటెంట్ ఎక్కువ. అందుకే బరువు నియంత్రణలో ఉంటుంది. కడుపు, నడుము చుట్టూ ఫ్యాట్ ఉంటే ఆరెంజ్ రోజూ తినడం ద్వారా దూరం చేయవచ్చు.
ఆరెంజ్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఆరెంజ్ అద్బుతంగా పనిచేస్తుంది. ఫలితంగా అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్ వంటి ముప్పు తగ్గిపోతుంది.
Also read: Indigestion Reasons: అజీర్తికి ప్రధానమైన 10 కారణాలివే, వీటికి దూరంగా ఉంటే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook