Potassium Deficiency: పొటాషియం లోపిస్తే శరీరంలో ఏయే లక్షణాలు కన్పిస్తాయి, కారణమేంటి

Potassium Deficiency: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. పోషకాలు లోపిస్తే ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతుంటుంది. ముఖ్యంగా అలసట, ఒత్తిడి, మలబద్ధకం వంటి సమస్యలు ఇటీవలికాలంలో ప్రధానంగా మారాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2024, 09:31 PM IST
Potassium Deficiency: పొటాషియం లోపిస్తే శరీరంలో ఏయే లక్షణాలు కన్పిస్తాయి, కారణమేంటి

Potassium Deficiency: అందుకే శరీరం ఆరోగ్యం కోసం విటమిన్లు, మినరల్స్ చాలా కీలక భూమిక పోషిస్తాయి. పొటాషియం అనేది శరీరంలో నీటి పరిమాణంతో పాటు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచేందుకు దోహదం చేస్తుంది. ఒకవేళ పొటాషియం లోపిస్తే వివిధ రకాల సమస్యలు ఏర్పడవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

శరీర నిర్మాణంలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ముఖ్య భూమిక వహిస్తుంటాయి. ప్రతి విటమిన్ లేదా మినరల్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పొటాషియం అనేది చాలా అవసరమౌతుంది. ఇది అత్యంత ముఖ్యమైన ఖనిజం. శరీరంలో నీటి పరిమాణాన్ని, రక్తపోటు రెండింటినీ నియంత్రిస్తుంది. నరాల పనితీరుపై పొటాషియం కీలక ప్రభావం చూపిస్తుంది. శరీరంలో పొటాషియం తగ్గడానికి చాలా కారణాలే ఉంటాయి. అతిగా యాంటీ బయోటిక్ మందులు వాడటం వల్ల విరేచనాలు, వాంతులు, మెగ్నీషియం తగ్గడం, చెమట ఎక్కువగా పట్టడం, ఫోలిక్ యాసిడ్ తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. శరీరంలో పొటాషియం తగ్గితే నీరసం ఎక్కువగా ఉంటుంది. అలసట ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ లక్షణాలు కన్పిస్తే శరీరంలో పొటాషియం లోపం ఉన్నట్టు అర్ధం చేసుకోవాలి. 

సాధారణంగా శరీరంలో ఎక్కడైనా రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడితే ఆ భాగంలో తిమ్మిరి పట్టినట్టుంటుంది. భుజాలు, కాళ్లలో అకారణంగా తిమ్మిరి పట్టినట్టుంటే లేదా చర్మం తిమ్మిరి పడుతుంటే పొటాషియం లోపముందని అర్ధం. తరచూ మూత్రం రావడం కూడా శరీరంలో పొటాషియం తగ్గిందనేందుకు ప్రధాన సంకేతం. అంతేకాకుండా ప్రతిసారీ యూరిన్ వస్తున్నట్టు ఉండటం కూడా అదే లక్షణం. ఈ పరిస్థితుల్లో వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 

జీర్ణక్రియ సరిగ్గా లేకపోయినా పొటాషియం లోపం కావచ్చు. ఆహారపు అలవాట్ల కారణంగా ఇలా జరుగుతుంటుంది. అదే సమస్య దీర్ఘకాలంగా ఉంటే మాత్రం పొటాషియం లోపం వల్ల కావచ్చు. కండరాల నొప్పి, కండరాల్లో సంకోచం వంటివి తలెత్తాయంటే పొటాషియం లోపం వల్లని అర్ధం చేసుకోవాలి. మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు పొటాషియం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మూడ్ స్వింగ్ , చికాకు, విసుగు వంటివి కూడా పొటాషియం లోపం వల్లే తలెత్తుతాయి. అందుకే శరీరంలో పొటాషియం లోపాన్ని సరిచేసేందుకు ఈ 5 పదార్ధాలను డైట్‌లో చేర్చాలి. 

పాలకూర, అవకాడో, కొబ్బరి నీళ్లు, అరటి పండ్లు, ఆనపకాయ విత్తనాలు. వీటిలో పొటాషియం కావల్సినంతగా లభిస్తుంది. రోజువారీ డైట్‌లో ఇవి ఉంటే ఇక పొటాషియం లోపమనేదే ఉండదు. ఫలితంగా సదా ఆరోగ్యంగా ఉంటారు. 

Also read: Custard Apple: సీతాఫలం పండ్లు వల్ల ఊపిరితిత్తుల సమస్య మాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News