Cholesterol Reduce Tips: కొలెస్ట్రాల్ ఎంత ప్రమాదకరమైందైనా ప్రకృతిలో లభించే పదార్దాలతో సులభంగానే నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక్క కొలెస్ట్రాల్ నియంత్రించగలిగితే సగం సమస్యలకు చెక్ పెట్టినట్టే. ప్రకృతిలో విరివిగా లభించే కొన్ని సీడ్స్ ఇందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.
కొలెస్ట్రాల్ అనేది రక్తంలో పేరుకుపోయే కొవ్వు లాంటి పదార్దం. మన ఆహారపు అలవాట్ల వల్లే ఇది పేరుకుపోతుంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే కొలెస్ట్రాల్ ను నిర్మూలిస్తే అన్ని వ్యాధులు దూరమౌతాయి. కొలెస్ట్రాల్ సమస్యను నిర్మూలించేందుకు కొన్ని సీడ్స్ ఉపయోగపడతాయి. వీటిలో పైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ చాలా సులభంగా తగ్గుతుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్దాలతో కొలెస్ట్రాల్ నిర్మూలన సాద్యమౌతుంది.
సాధారణంగా మనం తరచూ తినే కొన్ని పండ్ల విత్తనాలే ఇవి. మనం తెలియకుండా పడేస్తుంటాం. అందులో ఒకటి ఆనపకాయ విత్తనాలు. ఇందులో పోషకాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్‌తో పాటు ఫైటో స్టెరోల్ ఉండటంతో కొలెస్ట్రాల్ సమస్య చాలా త్వరగా తగ్గుతుంది.
ఇక రెండవది ఫ్లక్స్ సీడ్స్. ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ పెద్ద మొత్తంలో ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఈ విత్తనాల్ని పౌడర్‌గా చేసుకుని నీళ్లలో కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. దీంతోపాటు చియా సీడ్స్ కూడా కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదం చేస్తాయి. ఇందులో కూడా ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఇతర పోషకాలుంటాయి. వీటితోపాటు ఇందులో ప్రోటీన్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, యామిన్, మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.
ఇక మరో అద్భుతమైన ఔషధ గింజలు నువ్వులు. ఇతర విత్తనాల్లానే ఇందులో కూడా పోషక పదార్ధాలు ఎక్కువ. ఫైబర్, 5 రకాల ప్రోటీన్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఈ విత్తనాలను రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. కేవలం కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ నిర్మూలనకు దోహదపడుతుంది. మధుమేహం నియంత్రణకు కూడా ఈ విత్తనాలు ఉపయోగకరంగా ఉంటాయి.
Also read: Health Remedies: అల్సర్, మధుమేహం, మలబద్దకం సమస్యలకు అద్భుత ఔషధం ఈ ఆకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook