High Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణాలు పోవచ్చు. ఈ లక్షణాలుంటే జాగ్రత్త

High Cholesterol Symptoms: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఈ ఒక్క సమస్య వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటుంది. అందుకే సకాలంలో కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టకపోతే ఇతర సమస్యలు వెంటాడుతాయి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 12, 2023, 03:09 PM IST
High Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణాలు పోవచ్చు. ఈ లక్షణాలుంటే జాగ్రత్త

High Cholesterol Symptoms: హై కొలెస్ట్రాల్ అనేది సాధారణంగా కన్పించే తీవ్రమైన సమస్య. చాలామందిలో ఉన్నా బయటపడదు. బయటపడేసరికి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతుంటాయి.

హై కొలెస్ట్రాల్ అనేది ఓ సీరియస్ సమస్యగానే పరిగణించాలంటారు వైద్య నిపుణులు. ఎందుకంటే కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు ఉత్పన్నమౌతాయి. ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్య ఉన్నా బయటపడకుండా ఉండే పరిస్థితులుంటాయి. వ్యాధి లక్షణాలు విషమించే కొద్దీ వివిధ రూపాల్లో బయటపడుతుంటుంది. సకాలంలో గుర్తించలేకపోవడం వల్లనే ఈ పరిస్థితి. గుర్తించేసరికి ఆలస్యమైపోతుంది. కొలెస్ట్రాల్‌కు సంబంధించిన 2 లక్షణాల్ని సకాలంలో గుర్తించగలిగితే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి

అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటో తెలిస్తే ఆ వ్యాధి లక్షణాలెలా ఉంటాయో తెలుసుకోవవచ్చు. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కలిసిపోయి కన్పించే మోము లాంటి పదార్ధం. మనం తినే వివిధ రకాల ఆహార పదార్ధాల ద్వారా ఏర్పడుతుంది. ఇందులో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండుంటాయి. శరీర కణజాల నిర్మాణానికి , విటమిన్, హార్మోన్ తయారీలో కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. అయితే కొలెస్ట్రాల్ మోతాదుకు మించితే శరీరానికి నష్టం కలుగుతుంది. ఈ పరిస్థితినే హై కొలెస్ట్రాల్ అంటారు. 

 ప్రపంచంలో లక్షలాదిమంది హై కొలెస్ట్రాల్ సమస్యతో ఉన్నారని..అయితే లక్షణాలు కన్పించకపోవడంతో ఆ విషయం తెలియదని ప్రముఖ బ్రిటీష్ జర్నల్ బ్రిటీషన్ అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్ అండ్ లైఫ్‌స్టైల్ మెడిసిన్ చెబుతోంది. లక్షణాలు కన్పించకపోవడం వల్లనే కొలెస్ట్రాల్ సమస్యకు చికిత్స చేయించుకోలేకపోతున్నట్టు ఆ జర్నల్ వివరించింది. కొలెస్ట్రాల్ మరీ ఎక్కువైతే కంటి వద్ద దాని ప్రభావం కన్పిస్తుంది.

ఒకవేళ మీ కనురెప్పలు లేదా ముక్కు వద్ద తెల్లటి లేదా పసుపు రంగు గీతలు కన్పిస్తే ఇది కచ్చితంగా హై కొలెస్ట్రాల్ లక్షణంగా పరిగణించాలి. హై కొలెస్ట్రాల్‌లో ఈ స్థితిని xanthelasma deposits గా పిలుస్తారు. ముక్కు, కను రెప్పలపై గీతల్లాంటివి ఏర్పడటం అనేది జీన్స్ పరంగా వస్తుంది. అంటే కుటుంబంలో ఎవరికైనా కొలెస్ట్రాల్ సమస్య ఉంటే అది మీక్కూడా రావచ్చు. ఈ పరిస్థితిని hypercholesterolaemia అంటారు. 

మీ కంటి లోపల పసుపు రంగులో చిన్న గింజలా ఏర్పడి ఉంటే అది హై కొలెస్ట్రాల్ కారణం కావచ్చు. ఈ పరిస్థితి ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి. తక్షణం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. లేకపోతే పరిస్థితి విషమించి ప్రాణాంతకం కావచ్చు. కంటి వెలుపలి భాగం అంటే ఐరిస్ సమీపంలో పసుపుగా కన్పించడం మంచి లక్షణం కాదు. తక్షణం అప్రమత్తమై వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

హై కొలెస్ట్రాల్ సమస్య ఉన్నప్పుడు గుండెకు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు పెరగవచ్చు. అందుకే కొలెస్ట్రాల్‌ని ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణిస్తారు. నేరుగా కాకపోయినా పరోక్షంగా ప్రాణాంతకంగా మారుతుంది. peripheral arterial disease అంటే దీన్నే అంటారు. కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగినప్పుడు నడుస్తున్నా సరే కాళ్లలో భయంకరమైన నొప్పి ఉంటుంది. కాస్సేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. వీటితో పాటు కాలి వెంట్రుకలు ఊడటం, కాళ్లలో తిమ్మిరి లేదా బలహీనత, కాలి గాయాలు త్వరగా మానకపోవడం, కాలి చర్మం రంగు పుసుపు లేదా నీలంగా మారడం, పురుషుల్లో అయితే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, కాలి కండరాల్లో నొప్పులు. ఇవన్నీ హై కొలెస్ట్రాల్ లక్షణాలుగా పరిగణిస్తారు 

హై కొలెస్ట్రాల్ సమస్య నుంచి రక్షించుకునేందుకు చాలా ఉపాయాలుంటాయి. ఇందులో ఏది ఉపయుక్తమో గ్రహించి అలవర్చుకుంటే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ధూమపానం వదిలివేయడం, రోజూ తగిన వ్యాయామం, హెల్తీ ఫుడ్స్, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వంటివి అలవర్చుకోవాలి.

Also read: Breast Cancer: ఈ విత్తనాలు రోజూ తీసుకుంటే బ్రెస్ట్ కేన్సర్ సైతం అరికట్టవచ్చా, నిజానిజాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News