Dehydration Signs and Prevention Tips: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు కేవలం పోషక పదార్ధాలు పుష్కలంగా ఉండే ఆహారం తింటే సరిపోదు. మనిషి ఆరోగ్యానికి నీళ్లు కూడా అంతే అవసరం. భోజనం ఎంత అవసరమో నీరు కూడా అంతే ముఖ్యం. శరీరంలో సంభవించే సగం సమస్యలు నీళ్లతోనే దూరమౌతాయి. వేసవిలో నిర్ణీత రూపంలో తగిన నీరు తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. వేసవిలో సహజంగానే నీటి కొరత ఉంటుంది.
వేసవిలో సహజంగానే తరచూ తలనొప్పి, అలసట, తల తిరగడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. వివిధ రోగాలకు ఇవి సంకేతాలు కావచ్చు. అందుకే శరీరంలో ఎప్పుడూ నీటి కొరత రాకుండా చూసుకోవాలి. అయితే శరీరంలో నీటి కొరత ఉందో లేదో ఎలా తెలుస్తుంది, అంటే తగిన మోతాదులో నీళ్లు అందుతున్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవడం..
వేసవికాలంలో డీ హ్రైడ్రేషన్ లక్షణాలు ఇలా..
శరీరంలో నీళ్లు తక్కువైతే కన్పించే సంకేతాలు లక్షణాల్ని ఎప్పుడూ సీరియస్‌గా పరిగణించాలి. లైట్ డీ హైడ్రేషన్ అయితే దాహం, నోరెండిపోవడం, అలసట ఉంటాయి. అదే పరిస్థితి తీవ్రమైతే ఎటాక్, మరణం కూడా సంభవించవచ్చు.
యూరిన్ రంగు మారడం:
మీ యూరిన్ చిక్కగా రావడం లేదా రంగు మారడం గమనిస్తే..శరీరంలో నీటి శాతం తక్కువగా ఉందని అర్దం. మీ యూరిన్ డార్క్ ఎల్లో లేదా యాంబర్ రంగులో ఉంటే ఎక్కువ నీళ్లు తీసుకోవాలని అర్ధం.
నోరెండిపోవడం:
మనిషి శరీరంలో నీటి శాతం తక్కువైతే ఒక్కసారిగా నోరు ఎండిపోతుంటుంది. దాంతోపాటు నోట్లో అసౌకర్యం ఉంటుంది. ఈ పరిస్థితి ఉందంటే వెంటనే నీళ్లు తాగాలి. లేకపోతే పరిస్థితి తీవ్రం కావచ్చు.
Also Read: Cholesterol Signs: మీలో ఈ లక్షణాలు కన్పిస్తే అలర్ట్ అవాల్సిందే, కొలెస్ట్రాల్ సంకేతాలివి
దాహం వేయడం:
దాహం వేయడం అనేది మీ శరీరం మరింత నీరు కోరుకుంటుందనేదుకు సంకేతం. ఈ పరిస్థితి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పరిస్థితుల్లో వెంటనే నీళ్లు తాగాలి. శరీరం అవసరాన్ని గుర్తించి దాహం రూపంలో తెలుపుతుంది.
తల తిరగడం:
శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు కూడా తల తిరుగుతుంటుంది. మీకు ఉన్నట్టుండి తల తిరుగుతున్నట్టుగా ఉంటే మీ శరీరానికి నీళ్లు ఆవసరమని అర్ధం. వంటనే నీళ్లు 1-12 గ్లాసులు తాగాల్సి ఉంటుంది.
తలనొప్పి:
వేసవిలో డీ హైడ్రేషన్ కారణంగా తలనొప్పి, మైగ్రెయిన్ బాధించవచ్చు. తరచూ అదే పనిగా తలనొప్పి వస్తుంటే తగిన మొత్తంలో నీళ్లు తాగుతుంటే తగ్గుతుంది. ఎందుకంటే శరీరంలో డీ హైడ్రేట్ అవుతున్నప్పుడు తలనొప్పి వస్తుంది. ఇలా వివిధ రూపాల్లో ఈ లక్షణాలు కన్పిస్తే మీ శరీరం డీ హైడ్రేట్ అవుతున్నట్టు అర్ధం చేసుకోవాలి. తక్షణం తగిన మొత్తంలో నీళ్లు తాగడం ద్వారా ఆ పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చు. కానీ వాస్తవానికి ఎండాకాలంలో రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగుతుంటే ఈ పరిస్థితులు తలెత్తవు. ప్రతి 2 గంటలకోసారైనా గ్లాసు నీళ్లు తాగడం అలవాటుగా చేసుకుంటే వేసవిలో డీ హైడ్రేషన్ సమస్య రాదు.లేదా వేసవిలో సాధ్యమైనంతవరకూ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్ వంటివి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
Also Read: Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్ ఎందుకు ప్రమాదకరం, తగ్గించే మార్గాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook