Dehydration Symptoms: మనిషి శరీరంలో డీ హైడ్రేషన్ అతి పెద్ద సమస్య. శరీరం హైడ్రేట్‌గా లేకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే పోషక పదార్ధాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడంతో పాటు నీళ్లు కూడా తగినంత సేవించాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురౌతాయి.
మనిషి ఆరోగ్యం అనేది కేవలం పోషక ఆహారంపైనే కాకుండా తాగే నీటి పరిమాణంపై కూడా ఆధారపడి ఉంటుంది. తిండి ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే అవసరం. మనిషి శరీరంలో ఎదురయ్యే సగం సమస్యలు కారణం నీటి కొరతే. అందుకే రోజూ తగిన పరిమాణంలో అంటే రోజుకు 7-8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగితే ఎలాంటి అనారోగ్య సమస్య దరిచేరదు. ఇంకా సులభంగా చెప్పాలంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. శరీరంలో నీటి కొరత ఏర్పడితే తరచూ తలనొప్పి, అలసట, తల తిరగడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే శరీరంలో ఎప్పుడూ నీటి కొరత రాకుండా చూసుకోవాలి. అయితే శరీరంలో నీటి కొరత ఉందో లేదో ఎలా తెలుస్తుంది, అంటే తగిన మోతాదులో నీళ్లు అందుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే డీ హైడ్రేషన్ సమస్య ఒక్కోసారి మరణానికి దారి తీయవచ్చు.
డీ హ్రైడ్రేషన్ లక్షణాలు
యూరిన్ రంగు మారడం. చాలా సందర్భాల్లో యూరిన్ చిక్కగా రావడం లేదా రంగు మారడం గమనించవచ్చు. ఇలా ఉంటే శరీరంలో నీటి శాతం తక్కువగా ఉందని అర్దం. ఈ పరిస్థితి ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి.
ఇక రెండవది నోరెండిపోవడం. శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు ఒక్కసారిగా నోరు ఎండిపోతుంటుంది. అంతేకాకుండా నోట్లో అసౌకర్యంగా ఉంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే నీళ్లు తాగాలి. లేకపోతే పరిస్థితి తీవ్రం కావచ్చు. ఇక మూడవ లక్షణం దాహం వేయడం. శరీరం మరింత నీరు కోరుకుంటున్నప్పుడు దాహం వేస్తుంటుంది. ఈ పరిస్థితి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పరిస్థితుల్లో వెంటనే నీళ్లు తాగాలి.
తల తిరగడం కూడా నీటి కొరత లక్షణమే. శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు కూడా తల తిరుగుతుంటుంది. మీకు ఉన్నట్టుండి తల తిరుగుతున్నట్టుగా ఉంటే మీ శరీరానికి నీళ్లు ఆవసరమని అర్ధం. ఇక మరో లక్షణం తలనొప్పి. డీ హైడ్రేషన్ కారణంగా తలనొప్పి, మైగ్రెయిన్ బాధించవచ్చు. తరచూ అదే పనిగా తలనొప్పి వస్తుంటే తగిన మొత్తంలో నీళ్లు తాగుతుంటే తగ్గుతుంది. ఇలా వివిధ లక్షణాలు కన్పిస్తే శరీరం డీ హైడ్రేట్ అవుతున్నట్టు అర్ధం. ఈ పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే నీళ్లు తాగడం ద్వారా ఆ పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చు.
Also read: Diabetes Tips: రోజూ ఇలా చేస్తే మధుమేహం దానంతటదే నియంత్రణలో వస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook