Gut Health: మనిషి ఆరోగ్య రహస్యాలు దాగున్నది ప్రేవుల్లోనే, నిపుణుల అధ్యయనం

Gut Health: మనిషి ఆరోగ్యం లేదా అనారోగ్యం అనేది శరీరంలోని పొట్ట భాగం నుంచి ప్రారంభమౌతుంది. అన్ని రకాల వ్యాధులు మొదలయ్యేది కడుపు నుంచే. కారణం ఆరోగ్య రహస్యం దాగుండేది ప్రేవుల్లో. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 25, 2024, 08:04 PM IST
Gut Health: మనిషి ఆరోగ్య రహస్యాలు దాగున్నది ప్రేవుల్లోనే, నిపుణుల అధ్యయనం

Gut Health: ఆరోగ్యానికి సంబంధించిన కీలక అంశాలన్నీ శరీరంలోని ప్రేవుల్లో ఇమిడి ఉంటాయంటున్నారు నిపుణులు. తాజా అధ్యయనాల ప్రకారం ఆరోగ్య రహస్యాలు ఇందులోనే దాగున్నాయి. అంటే దీనర్ధం ప్రేవులు ఆరోగ్యంగా ఉన్నంతవరకూ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అక్కడేదైనా సమస్య తలెత్తితే క్రమంగా అనారోగ్య సమస్యలు వెండాడుతాయి. 

మనిషి ఎదుర్కొనే వివిధ రకాల సమస్యల్లో చాలావరకూ కడుపు నుంచే మొదలవుతాయి. కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం ఇలా అన్నింటికీ కారణం ఇదే. దీనికి కారణం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వ్యవస్థ కడుపులోనే ఉంటుంది. తిన్న ఆహారం జీర్ణానికి ఉపయోగపడే వ్యవస్థ ఇదే. అందుకే అత్యంత కీలకమైందిగా పరిగణిస్తారు. ప్రేవుల్లో తలెత్తే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. జీర్ణక్రియ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వ్యవస్థను బట్టే ఆరోగ్యం ఆధారపజి ఉంటుంది. వీటిలో ఏదైనా సమస్య తలెత్తితే త్వరగా గుర్తించగలిగితే త్వరగా నయమౌతుంది. 

ఓ అధ్యయనం ప్రకారం దేశంలో 80 శాతం జనాభా హెచ్ ఫైలేరీతో బాధపడుతున్నారు. ఇదొక బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్. మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వ్యాయామం, డైటింగ్, డైట్ మార్పులు వంటివి చాలా అవసరం. హెచ్ ఫైలేరీ అనేది ఇతర వ్యాధులకు కారణమౌతుంటుంది. దీనిని ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత త్వరగా నయం చేయవచ్చు. 

హెచ్ ఫైలేరీ సోకిన రోగుల్లో సాధారణంగా లక్షణాలు పెద్దగా కన్పించవు. కొన్ని కేసుల్లో సంక్రమణకు కారణం కడుపులో అల్సర్ లేదా ఏదైనా గాయం కావచ్చు. అజీర్తి కూడా కారణం కావచ్చు. దీర్ఘకాలం ఈ సమస్య కొనసాగితే కడుపు కేన్సర్ ముప్పు ఉండవచ్చు. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న 50 నుంచి 65 శాతం భారతీయ రోగులు, గ్యాస్ట్రిక్ కేన్సర్ సోకిన 42 నుంచి 75 శాతం రోగుల్లో ఈ సంక్రమణ ఉంటుంది. 

హెచ్ ఫైలేరీ బ్యాక్టీరియా సాధారణంగా చిన్నారుల్లో పదేళ్ల వయస్సులో సోకుతుంది. దీనివల్ల ఎదురయ్యే వ్యాధులు మాత్రం అన్ని వయస్సులకు సోకవచ్చు. వ్యక్తి నుంచి వ్యక్తికి, కాలుష్యపు నీరు, ఆహారం ద్వారా సంక్రమించవచ్చు. 

Also read: Watermelon: మధుమేహం రోగులు పుచ్చకాయ తినవచ్చా లేదా, పుచ్చకాయ తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News