Liver Damage: శరీరంలో ఏ విటమిన్ ఎక్కువైతే లివర్ దెబ్బతింటుందో తెలుసా

Liver Damage: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. అంతేకాదు..ఏ విటమిన్ ఏ మోతాదులో ఉండాలో అంతే ఉండాలి. విటమిన్లు, మినరల్స్ ఎక్కువైనా లేదా తక్కువైనా ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2024, 11:02 PM IST
Liver Damage: శరీరంలో ఏ విటమిన్ ఎక్కువైతే లివర్ దెబ్బతింటుందో తెలుసా

Liver Damage: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే అవసరమైన అంగం. లివర్ అనేది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడం, విష పదార్ధాలను బయటకు పంపించడంలో కీలకపాత్రక పోషిస్తుంది. అటు రక్త సరఫరాను సైతం మెరుగుపరుస్తుంది. అందుకే లివర్‌ను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. లివర్ దెబ్బతింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు.

లివర్ ఎందుకు దెబ్బతింటుంది. లివర్ అనారోగ్యానికి ఏయే కారణాలు ఉండవచ్చనేది పరిశీలిస్తే ప్రధానంగా విన్పించేది మద్యపానం. చాలామందికి మద్యపానం అలవాటు లేకపోయినా లివర్ పాడవుతుంటుంది. దీనికి కారణం కొన్ని రకాల విటమిన్లు అధికంగా ఉండటమే. లివర్ తక్కువ డ్యామేజ్ అయితే పరవాలేదు. కొన్ని రోజులు లేదా వారాల వ్యవధిలో చికిత్స ద్వారా నయం చేయవచ్చు. అదే ఎక్కువ డ్యామేజ్ అయితే మాత్రం లివర్ రీప్లేస్‌మెంట్ ఒక్కటే మార్గం. అందుకే డైట్ తప్పనిసరిగా పాటించాలి. మద్యపాానికి దూరంగా ఉండాలి. విటమిన్ బి3 అతిగా ఉండకూడదు.

విటమిన్ బి 3 అంటే నియాసిన్. మనం తినే ఆహారాన్ని ఎనర్జీగా మార్చేది ఇదే. అంతేకాకుండా జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం 19 ఏళ్ల కంటే అధికంగా వయస్సు ఉన్న పురుషుల్లో 16 మిల్లీగ్రాములు, మహిళలకు 14 మిల్లీగ్రాములు రోజుకు అవసరమౌతుంది. గర్భిణీ మహిళలకు రోజుకు 18 మిల్లీగ్రాములు కావల్సి ఉంటుంది. అదే పాలిచ్చే తల్లులకు రోజుకు 17 మిల్లీగ్రాములు అవసరం. 

విటమిన్ బి3 సహజసిద్ధంగా పాలు, మాంసం, ధాన్యం ద్వారా లభిస్తుంది. శరీరంలో మోతాదుకు మించి ఉండకూడదు. వైద్యుని సూచనలు లేకుండా విటమిన్ బి3 సప్లిమెంట్స్ వాడితే దుష్పరిణామాలు ఎదురౌతాయి. ముఖ్యంగా తల తిరగడం, చర్మం ఎర్రబడటం, హార్ట్ బీట్ ఎక్కువగా ఉండటం, దురద, వాంతులు, వికారం. కడుపులో నొప్పి, విరేచనాలు, గౌట్ లక్షణాలు కన్పిస్తాయి. లివర్ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రతి ఆరు నెలలకోసారి లివర్ ఫంక్షన్ ప్యానెల్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

Also read: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News