Protein Tips: శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. శరీరంలోని వివిధ అంగాల పనితీరు, కణాల నిర్మాణం, కండరాల నిర్మాణం క్రమ పద్ధతిలో ఉండాలంటే ప్రోటీన్లు చాలా అవసరం. శరీరంలో ఎంజైమ్స్, హార్మోన్లు, యాంటీ బాడీల తయారీలో కూడా ప్రోటీన్ల అవసరం ఉంటుంది. అయితే ప్రోటీన్లు ఎంత మోతాదులో ఉండాలి, లేకపోతే ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం.
శరీర నిర్మాణం, ఎదుగుదలలో ప్రోటీన్ల పాత్ర కీలకం అని అందరికీ తెలిసిందే. కానీ ప్రోటీన్లు శరీరానికి ఎంత మోతాదులో ఉండాలి. ప్రోటీన్ల కొరత ఉంటే ఏ వ్యాధులు సంభవిస్తాయనేది చాలామందికి అవగాహన ఉండదు. మనిషికి కావల్సిన ప్రోటీన్ల పరిమాణం వయస్సు, లింగం, యాక్టివిటీ లెవెల్స్ ఆరోగ్యాన్ని బట్టి మారుతుంటుంది. సాధారణంగా అయితే ఆరోగ్యకరమైన వ్యక్తికి ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్లు అవసరం. మీరు ఒకవేల 70 కిలోల బరువుంటే మీకు రోజుకు 56 గ్రాముల ప్రోటీన్లు అవసరమౌతాయి.
ప్రోటీన్లు ఎక్కువగా మాంసం, చేపలు, గుడ్లలో ఉంటాయి. పప్పులు, బీన్స్‌లో కూడా ప్రోటీన్లు అధిక మోతాదులో లభిస్తాయి. పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తుల్లో కావల్సినన్ని ప్రోటీన్లు దొరుకుతాయి.
ప్రోటీన్ల లోపంతో కన్పించే లక్షణాలు, వ్యాధులు
ప్రోటీన్ల లోపంతో అలసట, బలహీనత స్పష్టంగా కన్పిస్తాయి. కండరాలు బలహీనంగా ఉంటాయి. చర్మం, కేశాలు, గోర్లలో సమస్యలు కన్పిస్తాయి. శరీరంలో నొప్పులు, స్వెల్లింగ్ ఉంటుంది. వ్యాధుల సంక్రమణ ముప్పు ఉంటుంది. ప్రోటీన్ లోపంతో తలెత్తే ప్రమాదకర వ్యాధి క్వాషియోర్కోర్. పిల్లల్లో ఎక్కువగా కన్పిస్తుంది. ప్రోటీన్లు లోపిస్తే ఎనీమియాకు దారితీస్తుంది. అంటే రక్త హీనత. ఇక అన్నింటికంటే ప్రమాదకరమైంద ఆస్టియోపోరోసిస్. ఎముకలకు సంబంధించిన వ్యాధి ఇది.
శరీరంలో ప్రోటీన్ లోపం లేకుండా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ కోసం న్యూట్రిషనిస్ట్ సలహాలు సూచనలు పాటించాలి. సాధ్యమైనంతవరకూ ఆహార పదార్ధాల ద్వారా ప్రోటీన్లు సమకూర్చుకునేందుకు ప్రయత్నించాలి. మందులపై అత్యవసరం అయితే తప్ప ఆధారపడకూడదు.
Also read: Yogasanam: ఈ ఐదు యోగాసనాలు వేస్తే చాలు మానసిక, శారీరక సమస్యలు దూరం<
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook