Cholesterol Tips: రక్త నాళాలపై దుష్ప్రభావం చూపే కొలెస్ట్రాల్, ఎలా తగ్గించుకోవాలి

Cholesterol Tips: శరీరంలో జరిగే మార్పులు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సంకేతాలుగా ఉంటాయి. ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాలతో అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అనాదిగా అందుబాటులో ఉన్న ఆయుర్వేదం చెబుతున్నది కూడా ఇదే. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 11, 2023, 05:43 PM IST
Cholesterol Tips: రక్త నాళాలపై దుష్ప్రభావం చూపే కొలెస్ట్రాల్, ఎలా తగ్గించుకోవాలి

Cholesterol Tips: ఆధునిక జీవనశైలిలో ఎదురౌతున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే ముందు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేదే అసలు ప్రశ్న. మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండే వివిధ రకాల ఆయుర్వేద పదార్ధాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఆ వివరాలు మీ కోసం..

ఆధునిక లైఫ్‌స్టైల్ వ్యాధుల్లో ఒకటి కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ పెరిగితే పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ నియంత్రించే మార్గాల్ని అనుసరించాల్సి ఉంటుంది. మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే కొన్ని రకాల ఆయుర్వేద పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇవి శరీరానికి శక్తినివ్వడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్త నాళికలు దెబ్బతింటాయి. ఈ క్రమంలో కొలెస్ట్రాల్ ఎలా నియంత్రించుకోవాలో పరిశీలిద్దాం..

కొలెస్ట్రాల్ తగ్గించుకోవడమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. దీనికోసం తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలను డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఫలితంగా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గేందుకు దోహదమౌతుంది. ఎండుద్రాక్ష, నువ్వులు కూడా కొలెస్ట్రాల్ నిర్మూలనలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇవి వాడటం వల్ల ఎడిబుల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనికోసం పండ్లు, శాకాహారంతో పాటు ఎండుద్రక్షను, వెన్నతో కలిపి నువ్వుల్ని సేవిస్తే మంచి ఫలితాలుంటాయి.

ఫైబర్, ప్రోటీన్లు తీసుకోవడం శరీరానికి చాలా ప్రయోజనకరం. వీటి వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. బ్రోకలీ, శాకాహార ప్రోటీన్లు, సోయా తరచూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తక్కువ వ్యవధిలోనే తగ్గించుకోవచ్చు. మరోవైపు ప్రతిరోజూ క్రమం తప్పకుండా అంజీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది. ఇక కొలెస్ట్రాల్ వేగంగా కరిగించే మరో ముఖ్య పదార్ధం ఆర్గాన్ ఆయిల్. ఆరోగ్యానికి చాలా మంచిది. వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది.

వీటితో పాటు ఆయుర్వేద గుణాలు కలిగిన ఔషధాలు చాలా ఉన్నాయి. శరీర నిర్మాణానికి, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు దోహదపడతాయి. మొత్తానికి పలు ఆయుర్వేద పదారాలతో కొలెస్ట్రాల్ చాలా సులంభంగా నియంత్రించవచ్చు.

Also read: Diabetes vs Stress: మధుమేహానికి ఒత్తిడికి ఉన్న సంబంధమేంటి, ఒత్తిడిని ఎలా గుర్తించాలి, సంకేతాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News