Healthy Lifestyle: పల్లీలే కదా అంటే..ఈ ప్రయోజనాలన్నీ గోవిందే..!

Peanuts Benefits: పల్లీలు ప్రతిరోజు.. తినడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మాంసంలో ఉండే ప్రోటీన్,డ్రైఫ్రూట్స్ లో ఉండే పోషకాలు మనకు పల్లీల  ద్వారా లభిస్తాయి. కాబట్టి పల్లీలే కదా అని మాత్రం వదిలేయకండి.. దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 1, 2024, 10:14 PM IST
Healthy Lifestyle: పల్లీలే కదా అంటే..ఈ ప్రయోజనాలన్నీ గోవిందే..!

Ground nuts: అత్యధిక ప్రోటీన్స్ కలిగి ఉన్న విత్తనాలలో వేరుశెనగ.. కూడా ఒకటి.ముఖ్యంగా అత్యంత సామాన్యుడు.. కూడా కొనగలిగే అద్భుతమైన పౌష్టికాహారం. మాంసంలో ఉన్నంత బలం ఈ వేరుశెనగల్లో ఉంటుంది. చాలా తక్కువ ధరకే మనకు మార్కెట్లో.. ఇవి లభ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా.. అన్ని పోషకాలను కలిగి ఉంటాయి. అయితే కొంతమంది వీటిని పల్లీలే కదా అంటూ తీసిపారేస్తూ ఉంటారు. కానీ వీటి ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారని చెప్పవచ్చు. ఇకపోతే పల్లీల వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఎలాంటి పోషకాలు లభిస్తాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. 

వేరుశెనగల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా రైబోఫ్లేవిన్ , విటమిన్ బి6 , థయామిన్, జింక్, కాపర్ , మాంగనీస్,  సెలీనియం , పొటాషియం,  ఐరన్,  కాల్షియం మంటి పోషకాలు లభిస్తాయి అంతేకాదు మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండడం వల్ల గుండె కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెపోటు రాకుండా నివారిస్తుంది.  ముఖ్యంగా 100 గ్రాముల వేరుశనగల్లో సుమారుగా 560 క్యాలరీల శక్తి లభిస్తుంది. 45 గ్రాముల కొవ్వు,  25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. వేరుశనగపప్పులను  పచ్చిగా గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి. అలాగే వేయించిన తర్వాత గ్రైండ్ చేస్తే బటర్ వస్తుంది. ఎండబెట్టి గ్రైండ్ చేస్తే నూనె కూడా లభిస్తుంది. చాలామంది ఎండబెట్టి గ్రైండ్ చేసిన తర్వాత వచ్చే నూనెను వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ వేరుశనగలను.. నానబెట్టి ఉడకబెట్టుకొని తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రెండు మూడు గంటలు నానబెట్టి.. ఆ తర్వాత 15 నిమిషాలు ఉడకబెడితే చాలా మెత్తగా.. తినడానికి రుచికరంగా ఉంటాయి. 

ఇలా నానబెట్టి ఉడకబెట్టి తినడం వల్ల మేక మాంసంలో ఉండే ప్రోటీన్ కంటే కూడా వేరుశనగల్లో ఎక్కువ లభిస్తుంది. 100 గ్రాముల మేక మాంసంలో 21 గ్రాముల ప్రోటీన్ లభిస్తే.. అదే 100 గ్రాముల వేరుశనగల్లో 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఉడకబెట్టిన వేరుశనగలు తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది.  కడుపులో సులభంగా జీర్ణం అవుతాయి. 

ఇక బలం కావాలి అంటే బాదం , కాజు మాత్రమే కాదు వేరుశనగలు కూడా తింటే కావలసినంత బలం శరీరానికి లభిస్తుంది. మానసిక సమస్యలు తగ్గడమే కాదు మూత్రపిండాల్లో రాళ్లు కూడా దూరం అవుతాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా పెద్ద పేగు క్యాన్సర్ కూడా రాకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి పల్లీలను రోజుకు గుప్పెడైనా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: NTR Bharosa Scheme: జగన్‌, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?

Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News