Heart Attack: వయస్సు 40 దాటినా గుండెపోటు ముప్పుండకూడదంటే ఈ 4 పదార్ధాలు చాలు

Heart Attack: గుండెపోటు. ఇటీవలి కాలంలో ప్రతి వయస్సువారినీ వెంటాడుతోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే..తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉండాలి. డైట్‌లో తీసుకునే పదార్ధాలతో గుండెవ్యాధుల్ని చాలా వరకూ అరికట్టవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2023, 11:27 AM IST
Heart Attack: వయస్సు 40 దాటినా గుండెపోటు ముప్పుండకూడదంటే ఈ 4 పదార్ధాలు చాలు

గుండె అనేది మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం. వయస్సు పెరిగే కొద్దీ శరీరంలోని అవయవాలు క్రమక్రమంగా పాడవుతుంటాయి. అందుకే బలహీనత ఉంటే ఎప్పుడూ నిర్లక్ష్యం వహించకూడదు. డైట్ అనేది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. 

సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ గుండపోటు ముప్పును తగ్గించాలంటే..డైట్ బాగుండేట్టు చూసుకోవాలి. కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన న్యూట్రిషన్ విలువలుంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. శరీర నిర్మాణంలో దోహదపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలకంగా ఉపయోగపడతాయి. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన డైట్ తీసుకుంటే 40 ఏళ్ల వయస్సు దాటినా గుండెపోటు ముప్పు తగ్గించవచ్చు.

గుండె ఆరోగ్యానికి కావల్సిన 4 పదార్ధాలు

హోల్ గ్రెయిన్స్

రిఫైండ్ ధాన్యాలు శరీర నిర్మాణంలో ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా దోహదపడతాయి. గుండె పోటు ముప్పును తగ్గించడంలో తృణధాన్యాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. 

డార్క్ చాకోలేట్

సాధారణ చాకోలేట్స్ చాలానే తింటుంటారు. కానీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే డార్క్ చాకోలేట్స్ తినడం మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే డార్క్ చాకోలేట్స్ తినడం వల్ల శరీరం, గుండె రెండూ విష పదార్ధాల నుంచి సురక్షితంగా ఉంటాయి. డార్క్ చాకోలేట్స్‌లో ఉండే పోషకాలు హార్ట్ ఇన్‌ఫెక్షన్ దూరం చేస్తాయి. 

ఫ్యాటీ ఫిష్

సాల్మన్, ట్యూనా వంటి ఫ్యాటీ చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని విభిన్న పనులకు ప్రోటీన్ల అవసరం చాలా కీలకం. దీంతోపాటు హెల్తీ ఫ్యాట్ శరీరాన్ని సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. విటమిన్లు జీర్ణమయ్యేలా చేస్తాయి.

ఆలివ్ ఆయిల్

జైతూన్ ఆయిల్‌లో ఆలివ్ ఆయిల్ పుష్కలంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇతర వంట నూనెలు కరోనరీ డిసీజ్ ముప్పును పెంచుతాయి. జైతూన్ నూనెతో ఈ ముప్పు తగ్గుతుంది. రోజూ డైట్‌లో జైతూన్ నూనె ఉపయోగించడం వల్ల గుండెపోటు ముప్పు వేగంగా తగ్గుతుంది. జైతూన్ నూనె ఉపయోగించినవారిలో గుండె ఆరోగ్యంగా ఉందని వివిధ అధ్యయనాల్లో గమనించారు.

Also read; Vitamin B12: విటమిన్ బి 12 లోపముంటే ఏమౌతుంది, ఏం తింటే మంచిది

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News