Heart Attack Signs: హార్ట్ ఎటాక్ అనేది ఆకశ్మికంగా, క్షణాల్లో సంభవించే ప్రాణాంతకమైన ఘటన. అందుకే చాలామంది హార్ట్ ఎటాక్ అంటే చాలు ఆందోళన చెందుతుంటారు. అయితే గుండె పోటు వచ్చే ముందు శరీరంలో కొన్ని లక్షణాలు తప్పకుండా ఉంటాయి. చాలావరకూ మనం వాటిని తేలిగ్గా తీసుకుంటాం. అవే లక్షణాలను ముందస్తుగా గుర్తించగలిగితే హార్ట్ ఎటాక్ నుంచి బయటపడవచ్చు
హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలో ఏదో ఒక భాగంలో ఊహించని నొప్పి లేదా తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ఇది హార్ట్ ఎటాక్ లక్షణమని గుర్తుంచుకోండి. ముఖ్యంగా శరీరంలో ఐదు రకాల నొప్పులు గుండె వ్యాధులకు సంకేతం కావచ్చు. గుండె నొప్పికి ప్రధాన లక్షణం ఛాతీలో నొప్పి లేదా తీవ్రమైన ఒత్తిడి ఉండటం. కొంతమందికి ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది. మరి కొంతమందికి తేలిగ్గా ఉండవచ్చు. అయితే ఛాతీ నొప్పిని మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇక భుజాలు, మెడ, వీపులో నొప్పి గుండె వ్యాధికి బలమైన సంకేతం కావచ్చు. ఈ నొప్పి తీవ్రంగా ఉంటే తేలిగ్గా తీసుకోకుండా వైద్యుని సంప్రదించాలి.
మరోవైపు భుజాల్లో, ఎడమ చేతిలో నొప్పి కూడా చాలా తీవ్రమైంది. గుండె వ్యాధికి ఇది తీవ్రమైన సంకేతంగా పరిగణించాలి. ఈ నొప్పి ఆకశ్మికంగా, తీవ్రంగా ఉండవచ్చు. ఒక్కోసారి దీర్ఘకాలంగా ఈ నొప్పి ఉంటుంది. మీక్కూడా ఈ నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. దవడ లేదా పంటి నొప్పి కూడా గుండె పోటుకు ఓ కారణం. ఒక్కోసారి గొంతులో కూడా నొప్పి రావచ్చు. ఈ లక్షణాలను కూడా తేలిగ్గా తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం, చెమట్లు పడుతుండటం గుండె పోటుకు ప్రధాన లక్షణం. చాలామంది అలసట అనుకుని వదిలేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం.
Also read: Low BP Symptoms: లోబీపీ సమస్యను తేలిగ్గా తీసుకుంటే ఏమౌతుంది, ఎలాంటి లక్షణాలుంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.