Low BP Symptoms: లోబీపీ సమస్యను తేలిగ్గా తీసుకుంటే ఏమౌతుంది, ఎలాంటి లక్షణాలుంటాయి

Low BP Symptoms: ఇటీవలి కాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు అధికమౌతున్నాయి. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. రక్తపోటు రెండు రకాలుగా ఉంటుంది. హై బీపీ వర్సెస్ లో బీపీ.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 2, 2025, 05:29 PM IST
Low BP Symptoms: లోబీపీ సమస్యను తేలిగ్గా తీసుకుంటే ఏమౌతుంది, ఎలాంటి లక్షణాలుంటాయి

Low BP Symptoms: అధిక రక్తపోటు ఏ విధంగా తీవ్రమైన అనారోగ్య సమస్యో లో బీపీ కూడా అదే స్థాయిలో సమస్య. కానీ చాలామంది లో బీపీని తేలిగ్గా తీసుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదకరం. లో బీపీను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కూడా ప్రాణాంతకమైంది. లో బీపీ ఎంత ప్రమాదకరమైందో తెలుసుకుందాం.

సాధారణంగా హెల్తీ మనిషి రక్తపోటు 120/80 ఉండాలి. అంటే సిస్టోలిక్ రీడింగ్ 120, డయాస్టోలిక్ రీడింగ్ 80 ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉండే అధిక రక్తపోటు అని అర్ధం. అదే తక్కువగా ఉండే లో బీపీ ఉందని సంకేతం. అధిక రక్తపోటు ఎంత ప్రమాదకరమో లో బీపీ కూడా అంతే డేంజర్. లో బీపీకు ఉన్న కారణాల్లో ప్రధానమైంది డీహైడ్రేషన్. శరీరంలో తగిన పరిమాణంలో నీరు లేకపోతే రక్త పరిమాణం తగ్గి లోబీపీ సమస్య ఉత్పన్నమౌతుంది. వాంతులు, చెమట్లు పట్టడం, తగినంత నీరు తాగకపోవడం డీ హైడ్రేషన్‌కు దారి తీస్తాయి. అదే విధంగా హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ బీట్, గుండె కవాటాల సమస్యలు కూడా తక్కువ రక్తపోటుకు కారణమౌతుంటాయి. ఇంకా చాలా అనారోగ్య కారణాలున్నాయి. విటమిన్ బి12, ఫోలేట్ లోపముంటే రక్తహీనత ఏర్పడి లోబీపీకు దారితీస్తుంది. ధైరాయిడ్, అడ్రినల్ గ్రంథి సమస్యలు కూడా లోబీపీకు కారకాలు.

శరీరంలో అంతర్గతంగా తలెత్తే సమస్యలు లోబీపీకు కారణమైతే కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా లోబీపీ సమస్య ఏర్పడవచ్చు. ముఖ్యంగా డిప్రెషన్ , పెయిన్ కిల్లర్ మందులు లోబీపీకు కారణాలౌతాయి. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పు కూడా మరో కారణం. శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు కూడా లోబీపీ సమస్య రావచ్చు. 

లోబీపీ సమస్య ఉంటే ప్రధానంగా కన్పించే లక్షణాల్లో మైకం, తల తిరిగినట్టుండటం ఉంటుంది. ఎక్కువగా కూర్చుని లేదా పడుకున్న స్థితి నుంచి నిలబడినప్పుడు అలా అవుతుంది. అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. కండరాలు బలహీనంగా ఉంటాయి. కడుపులో అసహజంగా ఉండి వాంతులు వికారం సమస్యలుంటాయి. కళ్లు మసకగా కన్పిస్తాయి. గుండె, ఛెస్ట్ నొప్పి ఉండవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. శరీరంం చల్లబడుతుంది. లోబీపీ నివారించాలంటే ముందుగా చేయాల్సింది డీ హైడ్రేషన్ సమస్య లేకుండా చూసుకోవడం. దీనికోసం రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి. కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. ఎంత అనేది వైద్యుని సలహా మేరకు ఉండాలి. ఇక డైట్ విషయంలో తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ ఉండేట్టు చూసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్ది కొద్దిగా తరచూ తింటుండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయాలి. 

లోబీపీ అప్పుడప్పుడూ కన్పిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలతో సరి చేయవచ్చు. కానీ అదే పనిగా ఎప్పుడూ లోబీపీ ఉంటే మాత్రం వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 

Also read: AP Cabinet Decisions: ఉచిత బస్సుపై సబ్ కమిటీ, అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News