Stomach Burning Home Remedies: పొట్టలో మంట, గ్యాస్‌ను తక్షణమే తగ్గించే ఎఫెక్టివ్ రెమెడీస్..

Stomach Burning Home Remedies: బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆయుర్వేద గుణాలు కలిగిన ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 20, 2024, 05:55 PM IST
Stomach Burning Home Remedies: పొట్టలో మంట, గ్యాస్‌ను తక్షణమే తగ్గించే ఎఫెక్టివ్ రెమెడీస్..

 

Stomach Burning Home Remedies In Telugu: బిజీ లైఫ్ స్టైల్, డైట్ పై సరైన శ్రద్ధ లేకపోవడం చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న పెద్ద తేడాల అందరూ బయట లభించే జంక్‌ ఫుడ్స్‌ అతిగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌, ఉబ్బరం వంటి సమస్యల బారిన పడుతున్నారు. నిజానికి చాలా మందిలో వీటి కారణంగా కూడా దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ఎందుకంటే అధిక పరిమాణంలో బర్గర్లు, పిజ్జా, చిప్స్ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం లెవల్స్‌ పెరిగిపోయి.. మధుమేహం, రక్తపోటు సమస్యలు వస్తున్నాయి.  

అలాగే ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం కాకపోవడం, పొట్టలో చికాకు వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దీని కారణంగా కొందరిలో అసిడిటీ, మలబద్ధకం, గ్యాస్, పొట్టలో మంట, నిద్ర లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో తయారు చేసిన ఔషధాలు వినియోగిస్తున్నారు. నిజానికి వీటిని వినయోగించడం చాలా హానికరం. అయితే వీటికి బదులుగా ఆయుర్వేద గుణాలు కలిగిన కొన్ని హోమ్‌ రెమెడీస్‌ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

లైకోరైస్ పొడి:
ఈ లైకోరైస్ పొడిని ప్రతి రోజు నీటిలో కలుపుకుని తాగడం వల్ల అజీర్ణంతో పాటు అన్ని రకాల పొట్ట సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా కడుపుతో మంట కూడా సులభంగా తగ్గుతుంది.

నిమ్మరసం:
ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వల్ల కూడా సులభంగా పొట్ట సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు పొట్టలోని మంటను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా పొట్టలో చికాకు కూడా తగ్గుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అల్లం రసం:  
అల్లం రసంలో కూడా అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఇందులో తేనెను కలిపి తాగడం వల్ల పొట్టలోని మంట తగ్గుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. 

కొత్తిమీర నీరు:  
కొత్తిమీర నీరు తాగడం వల్ల కూడా సులభంగా పొట్ట సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కడుపులో మంటను సులభంగా దూరం చేస్తుంది. అంతేకాకుండా కడుపు నొప్పిని కూడా తగ్గిస్తాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News