High Blood Pressure: అధిక రక్తపోటును బీపీ అని కూడా అంటారు. ఈ సమస్య బారిన ఒక్కసారి పడితే జీవితాంతం వేధిస్తునే ఉంటుంది. అంతేకాకుండా ఈ తీవ్ర దీర్ఘకాలిక వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిని వైద్యులు 'సైలెంట్ కిల్లర్' పిలుస్తారు. 2017లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం..భారత్ వ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు రక్తపోటు సమస్య బారిన పడుతున్నారని పేర్కొంది. కాబట్టి ఇలాంటి సమస్య రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బీపీని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులతో పాటు ప్రతి రోజు యోగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల BP నియంత్రణలో ఉండడమే కాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమన లభిస్తుంది. అయితే అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది యోగాసనాలు వేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
హై బ్లడ్ ప్రెజర్ కోసం ప్రత్యేక యోగాసనాలు:
బాలాసనం:
హైపర్ టెన్షన్‌తో బాధపడేవారు ప్రతి రోజు బాలాసన వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ యోగాసనాన్ని ప్రతి రోజు వేయడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా సులభంగా ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే ఈ ఆసనాన్ని చేయడానికి ముందుగా వజ్రాసనంలో కూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ..ముందుకు వంగండి, ఇలా చేసిన తర్వాత అరచేతులు నేలపై పెట్టి విశ్రాంతి తీసుకోండి. ఇదే స్థితిలో 5 నిమిషాల పాటు ఉంటే సులభంగా రక్తపోటు తగ్గుతుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి.
శవాసనం:
శవాసనం చేయడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని ప్రతి రోజు చేయడం వల్ల మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దీని కారణంగా తలనొప్పి, అలసట వంటి సమస్యలు దూరమవుతాయి. ఈ ఆసనాన్ని వేసే క్రమంలో మీ దృష్టి అంతా మీ శ్వాసపైనే ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి