మీ చుట్టూ ఉన్న అందరికీ కరోనా వైరస్ ( Coronavirus ) సోకి..మీకు సోకలేదా ? మీ అందరూ కరోనా వైరస్ బారిన పడి..మీలో ఒకరికి రాలేదా? దీనికి కారణం ఇమ్యూనిటీ ( Immunity ) అని ఇప్పటివరకూ భావిస్తున్నాం. కానీ అంతకంటే ముఖ్యం మీ బ్లడ్ గ్రూప్. బ్లడ్ గ్రూపుల్ని బట్టి కరోనా వైరస్ ప్రభావం ఆధారపడి ఉంటుందనేది తాజా అధ్యయనాలు చెబుతున్న మాట.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి వేర్వేరు అంశాలు ప్రచారంలో ఉన్నాయి. రోగ నిరోధక శక్తి ( Immunity power ) ఎక్కువగా ఉన్నవారికి కరోనా వైరస్ సోకదని లేదా ప్రభావం చూపించదని ఇప్పటివరకూ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు వివిధ యూనివర్శిటీ పరిశోధనల్లో ఒకే విషయం స్పష్టంగా తెలుస్తోంది. బ్లడ్ గ్రూపుల్ని ( Blood Group ) బట్టి కరోనా వైరస్ ప్రభావం ఉంటుందనేది కొత్త విషయం. రోగ నిరోధక శక్తి ఒక్కటే కాదు బ్లడ్ గ్రూప్ సైతం కరోనా వైరస్ ను ప్రభావితం చేయగలదు. కొన్ని రకాల బ్లడ్ గ్రూపులు బలహీనంగా ఉంటే..మరి కొన్ని శక్తివంతంగా ఉండటమే దీనికి కారణం.
కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ ( Columbia university ), డెన్మార్క్‌లోని ఓడెన్స్ ( Odense university ) యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకులు వేర్వేరుగా జరిపిన రెండు తాజా అధ్యయనాల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓ బ్లడ్ గ్రూప్ ( పాజిటివ్ గానీ నెగెటివ్ గానీ ) కలిగినవారిపై కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపించడం లేదని ఓడెన్స్ యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో వైరస్ కారణంగా శరీర అవయవాలు చెడిపోవడం గానీ మత్యువాత పడడం గానీ చాలా తక్కువని తేలింది. అయితే వైరస్ బారిన పడుతున్నవారిలో ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం గుర్తించారు. Also read: Benefits of Mint: పుదీనా ఆకుల వల్ల ఎన్ని లాభాలో తెలుసా ? జలుబు, గొంతునొప్పి తగ్గడంతో పాటు...
ఇక ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్‌ల వారు మాత్రం అత్యధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని..వారిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని తెలుస్తోంది. ఈ గ్రూప్ వారిపట్ల కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతోందని డానిష్ పరిశోధకులు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల 73 వేల కరోనా కేసులపై ఈ అధ్యయనం జరిగింది. ఓ, బీ బడ్ గ్రూపుల వారితో పోలిస్తే...ఏ, ఏబీ బడ్ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని తేలింది. కరోనా వైరస్ ప్రభావం కూడా ఏ, ఏబీ గ్రూప్‌లపైనే తీవ్రంగా ఉంటోందని బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ జరిపిన మరో అధ్యయనంలో బయట పడింది. ఓడెన్స్ అధ్యయనంలో కరోనా కేసుల్లో 38 శాతం మంది ఓ బ్లడ్ గ్రూప్ వారుకాగా, 62 శాతం మంది ఏ, బీ లేదా ఏబీ బ్లడ్ గ్రూప్‌లవారున్నారు.
రెండు అధ్యయనాల్లోనూ పరిశోధకులు దాదాపుగా ఏకాభిప్రాయాన్నే వ్యక్తం చేసారు. ఒక్క బి బ్లడ్ గ్రూప్ విషయంలోనే రెండు అధ్యయనాల్లో తేడా కన్పిస్తోంది. అమెరికా ( America ) , బ్రిటన్ ( Britain ) దేశాల్లో 45 శాతం మంది ఏ, ఏబీ బ్లడ్ గ్రూప్ వారే కరోనా వైరస్ బారిన పడ్డట్టు తెలిసింది. తీవ్ర ప్రభావం పడుతున్నది కూడా ఏ బ్లడ్ గ్రూప్ వారికేనని ..వీరికే ఆక్సిజన్ వెంటిలేటర్ అవసరమౌతోందని ఈ అధ్యయనాలు తేల్చాయి. బ్లడ్ గ్రూపుల్ని బట్టి రోగ నిరోధక శక్తి ఉంటుందని గతంలోనే కొన్ని అద్యయనాలు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఈ కొలంబియా, ఓడెన్స్ యూనివర్సిటీలు చేసిన పరిశోధనల్లో బ్లడ్ గ్రూపుల్ని బట్టి కరోనా వైరస్ ప్రభావం ఉంటుందనడం దీనికి నిదర్శనంగా తెలుస్తోంది. Also read: Side Effects Of Green Tea: గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు ఇవే!