Migraine In Summers: మండే వేడిలో మైగ్రేన్ ఎటాక్‌ నుంచి ఎలా రక్షణ పొందాలి..?

Migraine In Summers: మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పితో కూడిన సాధారణ నరాల సమస్య. ఈ సమస్య పురుషులతో పోలిస్తే స్త్రీలలో అధికంగా ఉంటుంది. అయితే మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుందని వైద్యులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 05:50 PM IST
  • మైగ్రేన్ తీవ్రమైన తలనొప్పి
  • వేసవిలో స్త్రీలలోని అధికంగా మైగ్రేన్
  • ఒత్తిడి, పెద్ద శబ్దాలు, ఎండ కారణంగా మైగ్రేన్
Migraine In Summers: మండే వేడిలో మైగ్రేన్ ఎటాక్‌ నుంచి ఎలా రక్షణ పొందాలి..?

Migraine In Summers: మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పితో కూడిన సాధారణ నరాల సమస్య. ఈ సమస్య పురుషులతో పోలిస్తే స్త్రీలలో అధికంగా ఉంటుంది. అయితే మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుందని వైద్యులు తెలిపారు. తల నొప్పే కాకుండా వాంతులు , విరేచనాలతో రోగి బాధపడతారని పేర్కొన్నారు. అలాగే వినికిడి లోపం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ సమస్య వేసవి కాలంలో అధికంగా ఉంటాయన్నారు. గ్లోబల్ డిసీజ్ బర్డెన్ స్టడీ ప్రకారం... మైగ్రేన్ అనేది ప్రపంచంలో మూడవ అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యని.. ఇది అధిక ఒత్తిడి, పెద్ద శబ్దాలు, హార్మోన్ మార్పులు, పీరియడ్స్, డీహైడ్రేషన్ వల్ల వస్తుందని వెల్లడించింది.

వేసవిలో మైగ్రేన్‌ను నివారించడానికి చిట్కాలు:

#హైడ్రేటెడ్ గా ఉండండి: మీరు ఇంటి నుంచి బయటకి వెళ్లినప్పు డీ హైడ్రేషన్‌ గురి కాకుండా వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.
#ఆహారం పట్ల శ్రద్ధ వహించండి: కాఫీ, రెడ్ వైన్, చాక్లెట్, చీజ్‌లకు బదులుగా మామిడి, పుచ్చకాయ, దోసకాయ, ఆకుకూరలు తినండి.
#టోపీలు వాడండి: బయటకు వళ్లే సమయాల్లో బలమైన సూర్యకాంతి తలకు తగలకుండా టోపీని ధరించడం వల్ల మైగ్రేన్ దాడి నుంచి రక్షిణ పొందవచ్చు.
#AC ఉష్ణోగ్రత:  AC ఉష్ణోగ్రత 25-27°C మధ్య ఉంచడం మేలు.
#సూర్యరశ్మి: సూర్యకాంతి అధికంగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకుండా రాత్రి సమయాల్లో పనులు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మైగ్రేన్ దాడి నుంచి ఎలా రక్షణ పొందాలి:

నిశ్శబ్దంగా ఉండే చల్లని ప్రదేశాల్లో ఉండటం మేలు. శరీరానికి కావాల్సిన తగిన విశ్రాంతి ఇవ్వడమే  కాకుండా.. ఎప్పడికప్పుడు నీటిని అందించడంతో  మైగ్రేన్ నుంచి రక్షణ పొందవచ్చు. వేసవి కాలంలో శరీరాని పోషకాలున్న ఆహార పదార్థాలను ఇస్తే మైగ్రేన్ నుంచి రక్షణ కలుగుతుంది.

Also Read: Weight Gain Reasons: బరువు పెరగడాని అతిపెద్ద 4 కారణాలు, మీరు కూడా ఈ తప్పులు చేయోద్దు..!

Also Read: Vijay in AK 62: స్టార్ హీరో సినిమాలో విల‌న్‌గా విజ‌య్.. ముచ్చటగా మూడోసారి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News