Cholesterol Control Diet: 3 వారాల్లో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, అధిక బరువుకు చెక్, నమ్మట్లేదా?

How To Reduce Ldl Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా  స్థూలకాయంతో పాటు రక్త పోటు సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి కొవ్వును నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.దీని కోసం ప్రతి రోజూ మజ్జిగ తాగాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2023, 05:31 PM IST
Cholesterol Control Diet: 3 వారాల్లో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, అధిక బరువుకు చెక్, నమ్మట్లేదా?

Dairy product in cholesterol: స్థూలకాయం అనేది ప్రస్తుతం సాధరణ సమస్యగా మారింది. ఆధునిక జీవన శైలిని అనుసరించడం, ఆహారపు అలవాట్ల కారణంగా సులభంగా బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా కొందరిలో అతిగా నూనె పదార్థాలు తినడం వల్ల కూడా వేగంగా బరువు పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరగడం వల్ల కూడా స్థూలకాయం సమస్యలు వస్తున్నాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా చాలా మందిలో ప్రస్తుతం గుండె పోటు సమస్యలు వస్తున్నాయి. అయితే సులభంగా శరీర బరువుతో పాటు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ ఆహారంలో మజ్జిగ తీసుకోవడం వల్ల సులభంగా పై సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగా ఎలా శరీర బరువును నియంత్రిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే వ్యాధులు ఇవే:
అధిక రక్తపోటు
మధుమేహం
ఊబకాయం
గుండెపోటు
కరోనరీ ఆర్టరీ వ్యాధి
ట్రిపుల్ నాళాల వ్యాధి

కొలెస్ట్రాల్‌ను ఎలా నియంత్రించాలి:
మజ్జిగలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రొటీన్లు, పొటాషియం, ఫాస్పరస్, మంచి బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ ,  కాల్షియం వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మజ్జిగ దుష్ప్రభావాలు:
అతిగా మజ్జిగను తాగడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కాకుండా తీవ్ర దుష్ప్రభావాలు కలుగొచ్చని నిపుణులు చెబుతున్నారు.మజ్జిగలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. కాబట్టి అతిగా తాగడం వల్ల కిడ్నీ సమస్యలకు దారీ తీసే ఛాన్స్‌ ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు మజ్జిగను అతిగా తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా అలర్జీ సమస్య, చర్మ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా జలుబుతో బాధపడుతున్నవారు అస్సలు తాగొద్దు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్

Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x