Health Benefits Of Ragi: రాగిలో అధికశాతం ప్రొటీన్లు లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. రాగిలో లభించే ప్రోటీన్ కారణంగా శరీరంలో పోషకాహార లోపాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. రాగులు తినడం వల్ల శరీరంలో రక్త పరిమాణం పెరుగుతుంది. రాగల వల్ల కలిగే మరి కొన్ని ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
శరీరానికి సరిపోయే ప్రోటీన్: రాగి తీసుకోవడం కారణంగా ప్రోటీన్ కంటెట్ ఎక్కువగా లభిస్తుంది. ప్రోటీన్ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు రాగి జావ, రాగి సంగటి తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫైబర్: రాగిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీని కారణంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడంలో: బరువు తగ్గడంలో రాగి కీలక ప్రాత పోషిస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ కారణంగా ఆకలి బాధలను తగ్గించడంలో సహాయపడుతుంది.
స్కిన్ డ్యామేజ్: అందంగా కనిపించడానికి రాగిని ఉపయోగించండి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం ద్వారా ఇది చర్మానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది.
Also Read: Heart-Health Foods: గుండె ఆరోగ్యానికి దోహదం చేసే టాప్ 5 ఆహార పదార్ధాలు, హార్ట్ ఎటాక్ సైతం దూరం
ఎముకలను బలంగా: కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారు రాగులను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. రాగిలోని కాల్షియం కారణంగా ఎముకల వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మధుమేహం: మధుమేహ సమస్యను తగ్గిచడంలో రాగులు ఉపయోగపడతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడంలో ఉపయోగపడుతుంది.
Also Read: Curd Benefits: పెరుగులో ఈ నాలుగు పదార్ధాలు కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు లెక్కే లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి