Surya namaskar: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి అనారోగ్యపు అలవాట్ల కారణంగా చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి తోడు మూడు పదుల వయసు దాటకముందే ఏదో రకమైన నొప్పులు వెంటాడుతూనే ఉన్నాయి. కాస్త దూరం నడిచినా ,ఒక గంట నిలుచుకున్నా ,ఒక పది నిమిషాలు కింద కూర్చున్నా తట్టుకోలేని స్థితిలో నేటి యువత నానా అగచాట్లు పడుతున్నారు. కంప్యూటర్ల ముందు గంటల కొద్ది కూర్చొని పోస్చర్ కూడా బాగా తిని వంగిపోయిన భంగిమకి ఫిక్స్ అయిపోతున్నారు. ముఖ్యంగా మహిళల్లో 30 దాటిన వారికి ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పిల్లల్ని కన్నాక మరింత వీక్ అవుతూ ఉంటారు అమ్మాయిలు.
ఇలాంటి వారి కోసం ఇంటి వద్దనే సులభంగా చేసుకుని యోగ ఆసనాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటన్నిటిలోకి సూర్య నమస్కారాల వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా పలు రకాల రోగాలు దూరం అవుతాయి. మానసికంగా ఏర్పడిన ఒత్తిడి కూడా సులభంగా తగ్గడంతో పాటు ఎంతో హెల్తీగా ఫీల్ అవుతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం సూర్యనమస్కారాలు చేయడం వల్ల మనకు కలిగే పలు రకాల ప్రయోజనాలు తెలుసుకుందాం.
సూర్య నమస్కారాలు రెగ్యులర్ గా చేయడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వెన్నెముక,కాళ్లు ,కీళ్లు నొప్పులు క్రమంగా తగ్గుతాయి. అంతేకాకుండా శరీరానికి ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. ఉద్యోగరీత్యా పని ఒత్తిడి కారణంగా ఏర్పడిన స్ట్రెస్ ని కూడా సూర్య నమస్కారాలు సులభంగా తగ్గిస్తాయి. యాంగ్సైటి వంటి సమస్యలు ఉన్నవారు సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు. నిద్రలేమి సమస్యను తగ్గించడంతోపాటు కంటి చూపును మెరుగు చేయడంలో కూడా సూర్య నమస్కారాలు తోడ్పడతాయి.
ఈ సూర్య నమస్కారాలు రోజుకి 12 సెట్స్ చేయడం వల్ల శరీరంలో బరువు క్రమంగా తగ్గడంతో పాటు కండరాల దారుఢ్యం పెరుగుతుంది. శరీరంలో రక్తప్రసరణ పెరగడంతో పాటు గుండెకు సంబంధించిన పలు సమస్యలను దూరం చేస్తుంది. సూర్య నమస్కారాలు జీర్ణక్రియను ఉత్తేజపరిచి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తారు. గ్యాస్ ,మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలను దూరంగా పెడతాయి. పైగా శ్వాస మీద దృష్టి పెడతాం కాబట్టి ఈ ఆసనాలు చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. అయితే సూర్య నమస్కారాలు ఒకేసారి 12 సెట్స్ చేయడం చాలా కష్టం. మెల్లిగా ఒకటి నుంచి మొదలుపెట్టి క్రమంగా మీ స్టామినాను బట్టి పెంచుకుంటూ పోవాలి. పలురకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే సూర్యనమస్కారాలను తప్పకుండా మీ ఎక్ససైజ్ రొటీన్ లో భాగంగా చేసుకోండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం అయినది. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు
Also read: Nerves problem: నరాల బలహీనత సమస్యలు రావడానికి కారాణాలు, ఉన్నవారు తీసుకోవాల్సి ఆహారాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి