Nerves problem: న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్యలు రావడానికి కారాణాలు, ఉన్నవారు తీసుకోవాల్సి ఆహారాలు..

Nerve Weakness Causes: ఆధునిక జీవనశైలిలో మార్పులు చోటు చేసుకోవడం కారణంగా  పలు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే  అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య ఒకటి. ఈ సమస్య కారణంగా బాధపడే వారిలో పెద్దవాళ్ళు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. దీని వల్ల వివిధ  అనారోగ్య స‌మ‌స్యలను ఎదుర్కోవాల్సి వ‌స్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకి న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య ఎందుకు వ‌స్తుంది..? ఎవ‌రిలో ఎక్కువ‌గా వ‌స్తుంది..? అనే అంశంపై మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 01:23 PM IST
Nerves problem: న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్యలు రావడానికి కారాణాలు, ఉన్నవారు తీసుకోవాల్సి ఆహారాలు..

nerve weakness causes: మానవ శరీరంలో నరాల ప్రాత ఎంతో ముఖ్యమైనదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మెదడు నుంచి శరీర అవయవాలకు సంకేతం చెప్పడానికి నరాలు కీలక ప్రాత పోషిస్తాయి. అయితే నరాలు ఎంతో సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా వెన్నెముకలో ఉండే న‌రాలు తెగిపోతే మ‌రలా అత‌కడానికి చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చేతులు, కాళ్లు ప‌డిపోతాయి.  ప్రస్తుత కాలంలో నరాల బలహీనత సమస్య బారిన పడడానికి అనేక కరణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కారణాలు ఎంటీ..? ఎవరికి వస్తుంది.. ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే ఆంశంపై తెలుసుకుందా. 

షుగ‌ర్ సమస్యతో ఉన్నవారు: మధుమేహం ఉన్నవారిలో నరాల సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనికి కారణం నరాలపై ఉండే మైలిన్‌ పొర దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో న‌రాల్లో మంట‌లు వస్తూఉంటాయి. 

ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకుంటే:

అధికంగా ఆల్కహాల్‌ తీసుకుంటున్నవారిలో కూడా నరాల బలహీనత ఉంటుంది. అయితే ఆల్కహాల్, ధూమ‌పానం చేయ‌డం కారణంగా శ‌రీరంలో  కెమికల్స్ చేరుతాయి. దీని తొలగించాలంటే విటమిన్‌ బి కాంప్లెక్స్‌ ఎక్కువ‌గా తీసుకోవాలి. 

Also Read:Joints Pain Relief: ఆముదం ఆకులతో మోకాళ్ళ, కీళ్ల నొప్పులకు 20 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..

విట‌మిన్ డి, ఇ శ‌రీరానికి అంద‌క‌పోవడం:

శరీరానికి సరిపడ విటమిన్లు అందకపోవడం కారణంగా నరాల బలహీనత బారిన పడవాల్సి ఉంటుంది. దీని కోసం అధికంగా విటమిన్‌లు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. 

మొల‌కెత్తిన గింజ‌లు:

న‌రాలు బ‌లంగా త‌యార‌వ్వడానికి మొల‌కెత్తిన గింజ‌లను, డ్రై ఫ్రూట్స్ ను త‌ప్పకుండా తీసుకోవాలి. విట‌మిన్ ఇ ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల సుల‌భంగా న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చని నిపుణులు అంటున్నారు.

Also Read: Eat Fruit After Drinking: ఆల్క‌హాల్‌ను ఎంత తాగిన సరే.. ఇలా మొత్తం దిగిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News