Ice cream in Monsoon: ఐస్‌క్రీమ్ ఇంచుమించు అందరికీ ఇష్టమైంది. వేసవిలో అందరూ తింటారు. కానీ కొంతమంది వర్షాకాలంలో సైతం అత్యంత ఇష్టంగా ఐస్‌క్రీమ్ లాగిస్తుంటారు. అయితే వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ తినడం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది..
కొన్ని పదార్ధాలు సీజన్‌ను బట్టి తినాలి. ముఖ్యంగా వేసవి కాలంలో అందరూ ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్..వర్షాకాలంలో ఎంతమాత్రం తినకూడదు. వర్షాకాలంలో ఐస్‌క్రీమ్స్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మీకు కూడా అటువంటి అలవాటుంటే వెంటనే మానుకోండి. వాస్తవానికి ఐస్‌క్రీమ్ వల్ల ముందుగా ఇబ్బంది ఏర్పడేది గొంతుకే. ఇది వేసవిలో కూడా ఉంటుంది కానీ..వర్షాకాలంలో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఐస్‌క్రీమ్స్ తినడం వల్ల కలిగే సమస్యలు, నష్టాలు తెలుసుకుందాం..
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఐస్‌క్రీమ్స్ తినడం వల్ల జలుపు, దగ్గు, ఛాతీలో పట్టినట్టుండటం వంటి సమస్యలు తలెత్తుతాయి. వర్షాకాలంలో స్వీట్స్ తినాలనే కోరిక ఉంటే..ఐస్‌క్రీమ్‌కు బదులు హల్వా తింటే మంచిది. సాధ్యమైనంతవరకూ ఐస్‌క్రీమ్స్‌ను దూరంగా పెట్టాలి ఈ సీజన్‌లో. ఐస్‌క్రీమ్స్ తినడం వల్ల ఎదురయ్యే మరో సమస్య తలనొప్పి. వర్షకాలంలో చల్లటినీళ్లు లేదా ఐస్‌క్రీమ్స్ తీసుకోవడం వల్ల మెదడు ఫ్రీజ్ అవుతుంది. మస్తిష్కంలోని నాళాలపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా తలనొప్పి వంటి సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా సైనస్ సమస్యతో ఇబ్బందిపడేవాళ్లు పూర్తిగా ఐస్‌క్రీమ్ దూరంగా పెట్టాల్సిందే.
వర్షాకాలం సమయంలో ఐస్‌క్రీమ్స్ తరచూ తింటే ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. కొన్ని సందర్భాల్లో గొంతులో కఫం సమస్య కూడా పెరుగుతుంది. ఫలితంగా జ్వరం, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. గొంతు ఇన్‌ఫెక్షన్‌కు ప్రధాన కారణం ఇదే. వర్షాకాలంలో సాధారణంగా ఇన్‌ఫెక్షన్, సంక్రమిత రోగాలు ముప్పు ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకూ ఇమ్యూనిటీ పెంచే పదార్ధాలే తీసుకోవాలి. ఐస్‌క్రీమ్స్ పూర్తిగా మానేయడం మంచిది.
Also read: Diabetes Test Tips: షుగర్ టెస్ట్ సమయంలో చేయకూడని తప్పులు ఇవే
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook