Morning Drinks for Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు ఎక్కువ ఉన్నారు. దీనికి మందులు మాత్రమే కాదు కొన్ని రకాల ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
నిమ్మకాయనీరు..
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ నీరు కలిపి తీసుకోవాలి. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలు సహజసిద్ధంగా తగ్గిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ కిడ్నీ పనితీరును ప్రేరేపిస్తుంది. అంతేకాదు నిమ్మకాయ నీరు మంచి డిటాక్స్ డ్రింక్ మాదిరి పనిచేస్తుంది. ఇది కిడ్నీల్లోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. రోజంతా హైడ్రేటేడ్ గా ఉండటానికి సహాయపడుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్..
యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇది శారీరక సమస్యలను నయం చేయడానికి తోడ్పడతాయి. శరీరంలో పీహెచ్ లెవల్స్‌ను సమతులం చేస్తుంది. ఒక గ్లాసు నీటితో ఓ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి తాగాలి.
గ్రీన్ సెలరీ..
ఆయుర్వేదంలో గ్రీన్ సెలరీ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుందని నమ్ముతారు. మన డైలీ డైట్లో సెలరీని యాడ్ చేసుకోవాలి. ఇది యూరిక్ యాసిడ్ ను తగ్గించేస్తుంది. ఉదయం లేచిన వెంటనే గ్రీన్ సెలరీతో జ్యూస్ తీసుకుంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: ఈ ఆకుతో అధిక చక్కెరకు చెక్.. ఇదే షుగర్‌కు ఎఫెక్టీవ్ హోం రెమిడీ..!
అల్లం టీ..
అల్లాన్ని అద్రక్ అని కూడా పిలుస్తారు. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది యూరిక్ యాసిర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే నయం చేస్తుంది. తాజా అల్లం వేళ్లతో అల్లం టీ ని తయారు చేసుకోవచ్చు. జాయింట్ పెయిన్స్, వాపు, గౌట్ సమస్యలకు చెక్ పెడుతుంది.
ఉసిరి రసం..
ఉసిరి రసం ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇది వాపు, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.
కీరదోస రసం..
ఇది మంచి సమ్మర్ సూపర్ ఫుడ్. అంతేకాదు ఇందులో మరిన్ని పోషకాలు ఉంటాయి. కీరదోసకాయ కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. కీరదోసతో రసం తయారు చేసుకోండి. రోజూ ఉదయం ఓ గ్లాసు పరగడుపున తీసుకుంటే మంచిది. శరీరంలో నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.
ఇదీ చదవండి: ఒక్క దానిమ్మతో 100 రోగాలు పరార్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..
ధనియాల నీరు..
ధనియాల నీటి ద్వారా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను నిర్వహిస్తుంది. ఇవి శరీరంలో విషాన్ని తొలగిస్తాయి. ధనియాల నీటిని వేడి చేసి చల్లగా చేసి తాగాలి. ధనియాల నీరు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook