కరోనా వైరస్ ( Corona virus ) కట్టడి కోసం నిరంతరం ప్రపంచంలో ఏదో మూల పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరికొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 30 సెకన్ల పాటు అలా చేస్తే..కరోనా ప్రభావం తగ్గుతుందని అంటున్నారు.
కరోనా వైరస్ నుంచి విముక్తి పొందేందుకు ప్రపంచమంతా పోరాడుతోంది. ప్రపంచాన్ని వైరస్ నుంచి రక్షించేందుకు శాస్త్రవేత్తల పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు వెల్లడిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే అమెరికా ( America ) లోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ( Penn state college of medicine ) చేసిన అధ్యయనం ఆసక్తికర అంశాల్ని చెబుతోంది.
మౌత్‌వాష్ ( Mouthwash ) లు, నోటి క్రిమినాశక మందులు కరోనా సంక్రమణ ప్రభావాన్ని ( Reduce corona spread ) తగ్గిస్తాయనేది పెన్ స్టేట్ కాలేజ్ అధ్యయనంలో తేలిన అంశం. కోవిడ్–19 ( Covid19 ) కు కారణమయ్యే SARS-CoV-2 వ్యాప్తిని తగ్గించడంలో మౌత్‌వాష్ తోడ్పడుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. కరోనా సంక్రమణ అనంతరం నోటిలో వైరల్ లోడ్ తగ్గించేందుకు ఈ ఉత్పత్తులు ఉపయోగపడతాయని జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీ ప్రచురించింది. Also read: Breakfast: బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా ? అయితే ఇది చదవండి
మనిషి శరీరంలో కరోనా వైరస్ లేకుండా చేయడానికి చేస్తున్న పరిశోధనల్లో భాగంగా.. కొంతమందికి మౌత్‌వాష్‌లు ఇచ్చి పరీక్షించారు. వీటిలో బేబీషాంపూ, నేటిపాట్, పెరాక్సైడ్ సోర్ మౌత్ క్లీనర్స్ ఉన్నాయి. ఈ పరీక్షల ద్వారా మౌత్‌వాష్ అనేది మనిషి శరీరంలో వైరస్ లేకుండా చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉందని నిరూపితమైంది. కోవిడ్19 పాజిటివ్ వ్యక్తుల ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను ఈ ఉత్పత్తుల ద్వారా తగ్గించే అవకాశం ఉందని పరిశోధనలతో ఒక అంచనాకు వచ్చారు.
కరోనా వైరస్ ను అంతం చేయడానికి 30 సెకన్ల పాటు మౌత్‌వాష్ చేస్తే వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుందని, గొంతులో ఉన్న వైరస్ అంతమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మనిషి శరీరంలో వైరస్ అంతానికి పరిశోధకులు తమ ల్యాబ్ లో వివిధ వైరస్ మౌత్‌వాష్‌లు ప్రయోగించగా మంచి ఫలితాలొచ్చాయని తెలిపారు. మౌత్‌వాష్‌ను ఓ 30 సెకన్ల పాటు షేక్ చేసి...పుక్కిలిస్తే నోటిలోపలి క్రిములు నశించి..వైరస్ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది.
కరోనా వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్ ( Corona vaccine ) తయారీ ఎంత ముఖ్యమో, వ్యాప్తిని తగ్గించే పద్ధతులు కూడా అంతే అవసరం. ఇప్పుడు అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరీక్షించిన ఉత్పత్తులన్నీ ఇప్పటికే మార్కెట్లో ఉండటమే కాకుండా ప్రజలు తరచూ ఉపయోగిస్తున్నవే కావడం గమనార్హం. ముక్కు, నోరు మార్గాలే కరోనా వైరస్ ప్రవేశానికి ముఖ్యదారులుగా వివిధ అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. అందుకే మౌత్‌వాష్‌లు, నోట్లోని క్రిమి నాశక మందులు కరోనా వైరస్ అంతానికి అత్యుతమ పద్ధతులుగా పరిశోధన తేల్చింది. Also read: Health Tips for Pregnant Women: గర్భిణిలు ఆ మెడిసిన్ వాడవద్దు.. కీలక సూచనలు