Omicron on Children: ఒమిక్రాన్ వేరియంట్ పిల్లల్ని టార్గెట్ చేస్తుందా, ఎంతవరకూ నిజం

Omicron on Children: ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ గురించి తెలుస్తున్న కొత్త విషయాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒమిక్రాన్ ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇది ఎంతవరకూ నిజమో పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2021, 07:09 AM IST
Omicron on Children: ఒమిక్రాన్ వేరియంట్ పిల్లల్ని టార్గెట్ చేస్తుందా, ఎంతవరకూ నిజం

Omicron on Children: ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ గురించి తెలుస్తున్న కొత్త విషయాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒమిక్రాన్ ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇది ఎంతవరకూ నిజమో పరిశీలిద్దాం.

దక్షిణాఫ్రికాలో(South Africa)వెలుగు చూసిన ఒమిక్రాన్ ముప్పు ఇప్పుడు ఇండియాలో కూడా మొదలైంది. దేశంలో అప్పడు కేసుల సంఖ్య 2 నుంచి 4కు చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ సంక్రమణపై ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తుందనే వార్తలో ఎక్కువ ఆందోళన కల్గిస్తున్నాయి. ఎందుకంటే దక్షిణాఫ్రికాలో చిన్నారుల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే సర్వత్రా ఆందోళన అధికమవుతోంది.  ఒమిక్రాన్ వాస్తవానికి 10 నుంచి 14 ఏళ్ల పిల్లలపై తీవ్ర ప్రభావం(Omicron effect on children) చూపిస్తుందని తెలుస్తోంది. డెల్టా, ఒమిక్రాన్, సూపర్ స్ట్రెయిన్ కలిసి ప్రభావం చూపించవచ్చనేది వైద్య నిపుణుల అంచనా. అందుకే 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ బూస్టర్ డోసు వేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

చిన్నారుల నుంచి 40 ఏళ్లవరకూ వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపధ్యంలో కొత్త వేరియంట్(Omicron Variant) సోకకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సహజసిద్ధమైన ఇమ్యూనిటీతో పాటు వ్యాక్సినేషన్ అవసరం. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి..భౌతిక దూరం పాటించాల్సి ఉంది. ఇటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అటు డెల్టా వేరియంట్ కారణంగా చాలమందిలో యాంటీబాడీలు ఏర్పడినందున వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తే ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రించవచ్చు. అందుకే దేశంలో 40 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోసు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇన్సాకాగ్ చెబుతోంది. ఎందుకంటే ఒమిక్రాన్ వేరియంట్‌ను ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు అడ్డుకోలేవని చెప్పేందుకు ఏ విధమైన ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 

ఒమిక్రాన్ కేసుల్ని గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ముఖ్యమనేది కేంద్ర ప్రభుత్వ (Central government)ఆలోచన. ఈ నేపధ్యంలో విదేశీ ప్రయాణీకులపై నిఘా పెట్టడమే కాకుండా దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ అవసరమని భావిస్తోంది. మరోవైపు చిన్నారులకు అంటే 12 ఏళ్ల దాటినవారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 

Also read: Health benifits of Cinnamon: దాల్చిన చెక్కతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News