Oversleeping Effects: ఆరోగ్యంగా ఉండేందుకు కంటికి సరిపడా నిద్ర ఉండాలి. రోజుకు 6 - 7 గంటల వరకు నిద్రించడం వల్ల.. ఆ వ్యక్తి రోజంతా ఉల్లాసంగా ఉంటాడు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అయితే అతిగా నిద్రించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తారు. అవసరానికి మించిన నిద్ర ఆరోగ్యానికి చేటు చేస్తుందని వెల్లడిస్తున్నారు. అయితే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసుకుందాం.
అతిగా నిద్రపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
1. తలనొప్పి
మన శరీరంలో ఉత్పత్తి అయ్యే సెరోటోనిన్ హార్మోన్ మన నిద్రను నియంత్రిస్తుంది. అయితే రోజులో మీరు ఎక్కువ సేపు నిద్రిస్తున్నట్లయితే.. ఆ హార్మోన్ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దాని వల్ల న్యూరోట్రాన్స్మిటర్లకు అంతరాయం కలుగుతుంది. దీని కారణంగా తలనొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎక్కువ సేపు నిద్రపోయే క్రమంలో చాలా మందికి ఆకలి, దాహం వేస్తుంది. దాని వల్ల కూడా తలనొప్పి వచ్చేందుకు అవకాశం ఉంది.
2. వెన్ను నొప్పి
మీకు ఎక్కువ సేపు నిద్రపోయే అలవాటు ఉంటే.. మీరు తరచుగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంటారు. సమాంతరంగా ఉండే ప్రదేశంపై కాకుండా లేదా ఏదైనా తక్కువ నాణ్యత కలిగిన పరుపుపై పడుకోవడం వల్ల నడుం నొప్పికి కారణం కావొచ్చు. నిద్రలో ఎలా పడితే అలా పడుకోవడం వల్ల కూడా కండరాలపై ఒత్తిడి కలగడం వల్ల వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది.
3. డిప్రెషన్
ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కలిగే మరో లక్షణం డిప్రెషన్. మీరు ఎక్కువసేపు నిద్రపోతే, ఈ కారణంగా మీ డిప్రెషన్ పెరుగుతుంది. లేదంటే కంటికి సరిపడా నిద్ర లేకపోతే.. మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అది మీరు రోజంతా చేసే పనులపై ప్రభావం చూపుతుంది.
4. విపరీతమైన అలసట
ఎక్కువసేపు నిద్రపోయిన తర్వాత, మీరు రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అతిగా నిద్రపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఇది. శరీరాన్ని ఎక్కువ సేపు విశ్రాంతి ఇచ్చినా ఇందుకు కారణం అవుతుంది. ఎక్కువ సేపు నిద్రించడం వల్ల శరీరంలోని కండరాలు, నరాలు దృఢంగా మారతాయి. దీంతో సదరు వ్యక్తి ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
5. మధుమేహం వచ్చే ప్రమాదం
అతిగా నిద్రపోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఇన్సులిన్‌ను నియంత్రించే హార్మోన్లు దీని వల్ల బాగా ప్రభావితమవుతాయి. అలసటగా అనిపించడం వల్ల శరీరంలో శక్తి లోపించి జంక్ ఫుడ్ లేదా క్యాలరీలు ఎక్కువగా ఉండే వాటిని తినడం మొదలుపెడతారు. దీంతో రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది.
Also Read: Water Side Effects: అతిగా మంచినీరు తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు!
Also Read: Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటే ఈ రోగాలు మీ దరిచేరవు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.