Water Weight Side Effects: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తగినంత మంచినీరు తాగాలని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. అయితే మంచినీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం కలిగిస్తుందని మీకు తెలుసా?నీరు ఎక్కువగా తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలలో నీటి వల్ల కలిగే బరువు ఒకటి. ఇది ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నీటి బరువు అంటే ఏమిటి?
శరీరంలో నీటి పరిమాణం పెరిగేకొద్దీ, మీ శరీర బరువు పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని నీటి బరువు లేదా హైడ్రేషన్ బరువు అంటారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ లేదా గర్భధారణ సమయంలో కూడా అతిగా తినడం వంటి వాటి అధిక బరువు కలుగుతుంది.
నీటి బరువు వల్ల సమస్యలు
అతిగా మంచినీరు తాగడం వల్ల పొత్తి కడుపు నొప్పి, శరీర అవయవాల వాపు లేదా పొత్తి కడుపు అమాంతం పెరిగిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. దీంతో పాటు శరీరం డీహైడ్రేట్ అవ్వడం వల్ల సోడియం స్థాయిలు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుందని పరిశోధనలో తేలింది. అలా సోడియం స్థాయి తగ్గడం కారణంగా మెదడలో మంట ఏర్పడే అవకాశం ఉంది. ఇది ప్రమాదకర దశ. దీన్ని వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది.
శరీరంలో తగినంత నీరు ఉంటే, ఎక్కువ నీరు త్రాగవలసిన అవసరం లేదు. రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీరు సరిపోతుంది. శరీరం తగినంతగా హైడ్రేట్ అయిందా లేదా నిర్జలీకరణంగా ఉందా లేదా అనేది క్రింది లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
పొడి బారిన చర్మం
శరీరంలో నీరు లేకపోవడం వల్ల మన చర్మం పొడిబారడం, పెదవులు ఎండిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.
గుండెల్లో మంట
శరీరంలో నీరు లేకపోవడం వల్ల ఛాతీలో కొంచెం మంట, ఆమ్లత్వం లేదా కడుపులో అసౌకర్యం ఏర్పడవచ్చు.
కండరాల తిమ్మిరి
శరీరంలో నీటి కొరత ఏర్పడడం వల్ల కండరాలలో నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల నిరంతరం తలనొప్పితో బాధపడతారు.
హాలిటోసిస్ సమస్య
శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోతే తగినంత లాలాజల ఉత్పత్తి జరగదు. దీని వల్ల నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. లాలాజల ఉత్పత్తి తగ్గితే నోటిలో బ్యాక్టీరియా సంఖ్య పెరిగి.. నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
మూత్ర సమస్యలు
మీ మూత్రం రంగు కాలక్రమేణా ముదురు లేదా పసుపు రంగులోకి మారినట్లయితే, అది నిర్జలీకరణానికి సంకేతం.
పైన పేర్కొన్న లక్షణాలు ఉన్న వారు రోజువారీ తాగే నీటి మోతాదును పెంచాల్సిన అవసరం ఉంది. అలాంటి సమస్యలు లేని వారు రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగితే సరిపోతుంది.
Also Read: Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటే ఈ రోగాలు మీ దరిచేరవు!
Also Read: Sperm Count: పురుషుల్లో శుక్రకణాల లోపాలకు కారణాలేంటో తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.