Papaya Health Benefits: ప్రకృతి అందించే చాలా రకాల పండ్లలో ఎన్నెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయా సీజన్న్‌లో దొరికే అన్ని రకాల పండ్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. ఒక్కొక్కో రకమైన పండులో ఒక్కో విధమైన పోషకాలు ఉంటాయి. అందుకే సీజన్ బట్టి వచ్చే అన్ని రకాల పండ్లను తినడం చాలా మంచిది. పండ్లు రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. ఆరోగ్యంతో పాటు శక్తి సామర్థ్యాలను పెంచడంలో సహాయపడుతాయి. కొన్ని పండ్లు కొన్ని వ్యాధులకు చికిత్సగా పనిచేస్తాయి. మరికొన్ని పండ్లు వ్యాధులను ధరి చేరనివ్వకుండా దోహదపడుతాయి. పండ్లలో బొప్పాయి చాలా మేలుచేస్తుంది.
బొప్పాయిలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు (A, C, E, K) మరియు ఫోలేట్ (విటమిన్ B9) ఉంటాయి. అంతేకాదు మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, ఇనుము మరియు మాంగనీస్ వంటి ఖనిజాలను అందిస్తుంది. వృద్ధాప్యం మరియు జీవనశైలి వ్యాధుల ఆగమనాన్ని నిరోధించడంలో సహాయపడే ఫైటోకెమికల్స్, కెరోటినాయిడ్లు మరియు ఇతర యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలను కూడా అందిస్తుంది. 150 గ్రాముల బొప్పాయి పండు కేవలం 60 కేలరీలను మాత్రమే అందిస్తుంది. బొప్పాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సురక్షితమైన ఆహారం.
బొప్పాయిలో ఉండే ఫోలేట్ రక్తప్రవాహంలో హోమోసిస్టీన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక స్థాయి హోమోసిస్టీన్ రక్త నాళాలను దెబ్బతీయడమే కాకుండా గుండె జబ్బులకు దారితీస్తుంది.బొప్పాయిలోని ఫైబర్ రక్తంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ను నిరోధిస్తుంది. పొటాషియం రక్త నాళాలలో ఒత్తిడిని తగ్గించడం మరియు మెరుగైన ప్రసరణను అందిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. బొప్పాయిలోని విటమిన్ ఎ, సి మరియు ఇ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
చెవి ఇన్ఫెక్షన్లు, జలుబు మరియు ఫ్లూలను దూరంగా ఉంచడంలో బొప్పాయి సాయపడుతుంది. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని అందరికి తెలుసు. అయితే ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు. ఈ రెండూ రక్తహీనతను ఎదుర్కోవడానికి దోహదపడుతాయి. అలసట, శ్వాసలోపం, తల తిరగడం మరియు తల నొప్పిని దూరం చేస్తాయి. బొప్పాయిలోని ఎంజైమ్‌లు-పాపైన్ మరియు చైమోపాపైన్.. గ్యాస్ట్రో డిస్ట్రెస్ మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ఎముకలకు కూడా బొప్పాయి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. బొప్పాయి ఊపిరితిత్తులను కాపాడుతుంది. ముఖ్యంగా ధూమపానం చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయి తినడం చర్మా కాంతి పెరుగుతుంది. నాడీ వ్యవస్థకు సహాయం చేస్తుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ ప్రక్రియను పెంచుతుంది. బొప్పాయి గింజలు శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి. హార్ట్ పేషెంట్స్ఇవి తింటే చాలా మంచిది.
పచ్చి బొప్పాయి లేదా పండిన బొప్పాయిని తినవచ్చు. బొప్పాయిని అల్పాహారం, భోజనం, స్నాక్స్‌లో చేర్చవచ్చు. లేదా డెజర్ట్‌గా కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలో బొప్పాయిని సలాడ్‌గా తీసుకోవచ్చు. బొప్పాయిలు ముక్కలు, పైనాపిల్ ముక్కలు, వెల్లుల్లి, నిమ్మరసం, ఉప్పు మరియు నల్ల మిరియాలతో జ్యూస్ చేసుకోవచ్చు.
Also Read: Virat Kohli Interview: ఆ విషయం చెప్పుకొనేందుకు నేను సిగ్గుపడను: కోహ్లీ
Also Read: Vinayaka Chavithi 2022: వినాయక చవితి ఎప్పుడు, విశిష్టత, పూజా విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook