Pfizer Covid-19 pills: న్యూయార్క్: కొవిడ్-19 పిల్‌పై తమ పరిశోధనల తాజా ఫలితాలను ఫైజర్ వెల్లడించింది. కరోనావైరస్ సోకిన వారు ఆస్పత్రిపాలవకుండా నిరోధించేందుకు కొవిడ్-19 మాత్రలు ఉపయోగపడుతున్నట్టు స్పష్టంచేసిన ఫైజర్.. కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉన్న వారిలో మరణాల సంఖ్యను తగ్గిండంలోనూ ఫైజర్ కొవిడ్ పిల్ 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు ఫైజర్ పార్మాసుటికల్స్ (Pfizer) తేల్చిచెప్పింది.
ఇటీవల వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కి (Pfizer COVID-19 pill to check Omicron) చెక్ పెట్టేందుకు సైతం తమ కంపెనీ తయారు చేస్తోన్న కొవిడ్ పిల్ సహాయపడుతుందని ఫైజర్ ప్రకటించింది. గత నెలలోనూ కొవిడ్ పిల్ పనితీరు ఫలితాలపై ఓ ప్రకటన చేసిన ఫైజర్.. కరోనాసోకినవారిలో కొవిడ్ పిల్ 89 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు వెల్లడించింది. 1200 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడైనట్టు అప్పట్లో ప్రకటించిన ఫైజర్ కంపెనీ.. తాజా అధ్యయనంలో మరో 1000 మందిపై కొవిడ్ పిల్ ప్రయోగించినట్టు తెలిపింది.
Also read : Omicron variant: ఒమిక్రాన్ పేషెంట్స్ సంఖ్య, మరణాలు సంఖ్య పెరగొచ్చు.. WHO హెచ్చరికలు
ఎలాంటి ప్రభావం లేని ఇతర ఔషదాలు తీసుకుని చనిపోయిన 12 మందితో పోల్చుకుంటే.. ఫైజర్ తీసుకున్న వారిలో ఒక్కరు కూడా చనిపోలేదని ఆ కంపెనీ తమ తాజా ప్రకటనలో పేర్కొంది. కొవిడ్ పిల్ ఆమోదం పొందినట్టయితే ప్యాక్స్‌లోవిడ్ (Paxlovid COVID pills) పేరుతో ఆ మెడిసిన్ అందుబాటులోకి రానున్నట్టు ఫైజర్ పేర్కొంది.
Also read : Omicron cases in China: ప్రపంచవ్యాప్తంగా 'ఒమిక్రాన్' కల్లోలం... చైనాలో తొలి కేసు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook