మొటిమలు.. పోగొట్టే చిట్కాలు

Last Updated : Feb 23, 2018, 01:33 PM IST
మొటిమలు.. పోగొట్టే చిట్కాలు

మొటిమలు ఎక్కువగా 80% యువతీయువకులకు వస్తాయి. దానికి కారణం హార్మోన్ల సమతుల్యత లోపించి సబేసియం గ్రంథుల నుంచి సెబమ్ ఎక్కువగా తయారుకావడమే. మొటిమలతో బయటికి వెళ్లాలంటే ఇబ్బందిపడుతుంటారు. కాబట్టి కొన్ని సులభ గృహ చిట్కాలతో మొటిమ సమస్యను దూరం చేయవచ్చు. 

* తాజా కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినరాదు. 

*  సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. 

*  గోరువెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుండి 6 సార్లు శుభ్రపరుచుకోవాలి. 

* టేబుల్ స్పూన్ గంధపు పొడిలో చెంచా పసుపు, పాలు కలుపుకొని ముఖానికి అద్దితే మొటిమలు తగ్గుతాయి. 

* దాల్చిన చెక్కను పేస్టులా చేసి ముఖానికి రాసుకొని కాసేపయ్యాక కడిగితే ఫలితం ఉంటుంది. 

* తులసి ఆకుల్ని నూరి అందులో రెండు మూడు చుక్కల నిమ్మరసం కలిపితే మొటిమలు తగ్గుతాయి, మచ్చలు కూడా కనిపించవు. 

* టమాటా గుజ్జును ముఖంపై మొటిమలకు రాసి పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి. 

* రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఉదయాన్నే యోగా, వ్యాయామం చేయాలి.   

* ముఖం మీద మొటిమలు ఉన్న ప్రదేశంలో ఐస్ గడ్డలతో రుద్దితే ఉపశమనం లభిస్తుంది.

Trending News