Cholesterol Control Fruit: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచుకోవాలి. దీంతో గుండె పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటుందట. కొలెస్ట్రాల్ అవ్వడం మాత్రమే కాదు.. రక్త సరఫరా కూడా మెరుగవుతుంది.
దానిమ్మ పండు గింజలు కూడా మంచి ఎర్రని రంగులో నిగనిగలాడుతూ కనిపిస్తాయి. ఈ పండులో కూడా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనల్స్ ఆరోగ్యాన్ని ప్రేరేపించే గుణాలు కలిగి ఉంటాయి.
పోషకాలు పుష్కలంగా ఉండే ఇందులో మెడిసినల్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జ్యూస్‌ను మీ డైట్లో కచ్చితంగా చేర్చుకోవాలి. ఈ పండు వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు మీ ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది. దానిమ్మ జ్యూస్ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లు..
దానిమ్మపండు ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సిడేటీవ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇది కార్డియో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా స్ట్రెస్, మంట సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా సెల్ డ్యామేజ్‌ను గుండె ఆరోగ్యానికి తోడ్సడుతుంది.
లో బ్లడ్ ప్రెజర్..
దానిమ్మ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. ఇందులో ముఖ్యంగా బయోయాక్టీవ్ కంపౌండ్స్ ఉంటాయి. ఇది శరీర రక్తపోటు నివారణకు సహాయడతాయి. హైపర్ టెన్షన్ ప్రమాదం రాకుండా నివారిస్తుంది.
మెరుగైన రక్తసరఫరా..
దానిమ్మ జ్యూస్‌లో రక్తసరఫరాను మెరుగు చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో త్వరగా రక్తనాళాల్లో చేరుతుంది. రక్త సరఫరాను మెరుగు చేస్తుంది. ఇది కార్డియో ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాలు మీకు దూరంగా ఉంటాయి.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది..
దానిమ్మ చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో నుంచి తగ్గించేస్తుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది. దీంతో మీ కార్డియో ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఎథెరోక్లోరోసిస్ వ్యాధుల బారిన పడకుండా, కరోనరీ ఆర్టెరీ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
ఇదీ చదవండి: రోజూ పాల టీ తాగుతున్నారా? ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది తెలుసా?
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు..
దానిమ్మ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కార్డియో ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది గుండె డ్యామేజ్ కాకుండా గుండె ఆరోగ్యానికి సహాయపడతుంది.
ఎథెరోక్లోరోసిస్..
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దానిమ్మను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇది ఆర్డెరీ బ్లాకేజీ కాకుండా నివారిస్తుంది. దీంతో ఎథెరోక్లోరోసిస్ రాకుండా నివారిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్, మంట సమస్యలను ఇది తగ్గిస్తుంది. గుండె సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి.
ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో పొరపాటున కూడా ఈ 6 ఆహారాలు తినకూడదు..
గుండె కణజాలం..
దానిమ్మ పండు జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె కణజాలాన్ని రక్షణగా ఉంటుంది. ఇది ఆక్సిడేటీవ్ డ్యామేజ్ కాకుండా ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. దీంతో గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. గుండెకు సంబంధించిన సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter