Protein Deficiency: మన శరీరానికి తగిన పరిమాణంలో ప్రోటీన్స్ ఎంతో అవసరం జుట్టు ఆరోగ్యానికి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి ప్రోటీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందిలో ప్రోటీన్ లోపం వంటి సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి.. తరచుగా ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మరికొందరిలో జుట్టు సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో చాలామందిలో ప్రోటీన్ లోపల సమస్యలు ఉన్నప్పటికీ ఎలాంటి శరీరంలోని ఎలాంటి లక్షణాలు కనిపించలేకపోతున్నాయి. బాడీలోని ప్రోటీన్ లోపించినప్పుడు తప్పకుండా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అవేంటో బాహ్య శరీరంపై ఎలాంటి లక్షణాలు వస్తాయే.. మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలామందిలో కండరాల బలహీనత వంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం ప్రోటీన్ లోపమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలు వచ్చి శరీర ఆకృతి కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. మరికొంతమందిలో ప్రోటీన్ లోపం కారణంగా జుట్టు కూడా పల్చబడుతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ప్రోటీన్ లోపం ఉన్న కొంత మందిలో జుట్టు కూడా నిర్జీవంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా ప్రోటీన్స్ కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రోటీన్ లోపం కారణంగా కొంతమందిలో శరీరంలోని రోగ నిరోధక శక్తి పై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరికొంతమందిలోనైతే నీరసం, పొట్ట ఉబ్బరం, శరీర శక్తి కోల్పోవడం, తరచుగా అలసిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తప్పకుండా శరీరంలోని ప్రోటీన్ లోపం ఉందని భావించి, ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
కొంతమందిలో ఈ లోపం కారణంగా బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తరచుగా మీరు కూడా బరువు తగ్గుతుంటే తప్పకుండా ప్రోటీన్‌కి సంబంధించిన టెస్ట్‌లను చేయించుకోవడం చాలా మంచిది. ఇంకొంతమందిలోనైతే శరీరంపై అక్కడక్కడ వాపులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా గోర్లు తరచుగా విరిగిపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉంటే కూడా తప్పకుండా మీలో ప్రోటీన్ లోపమే ఉందని భావించవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా తప్పకుండా ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter