Reduce Uric Acid In 8 Days: యూరిక్ యాసిడ్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి.. ఈ సమస్య కారణంగా చాలా మందిలో ఎముకల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఎంత తొందగా ఉపశమనం పొందితే అంతమంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్ర కీళ్ల నొప్పులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో పేరుకుపోయిన ప్యూరిన్‌ను తొలగించడానికి తప్పకుండా పలు ఇంచి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
యూరిక్ యాసిడ్ తగ్గించే ఇంటి నివారణాలు ఇవే:
గ్రీన్ టీని ప్రతి రోజూ తాగడం వల్ల కూడా సులభంగా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. ఈ టీలో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సులభంగా నియంత్రిస్తుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
దోసకాయ రసంతో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది క్రమం తప్పకుండా తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాల నిర్విషీకరణం అవుతాయి. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు మూత్రం సహాయంతో బయటకు వస్తాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
చెరుకు రసం ప్రతి రోజూ తాగడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జీర్ణ క్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని ప్రతి భాగంలో పేరుకుపోయిన మురికిని తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చెరకు రసం ప్రతి రోజూ తాగడం వల్ల ఎముకలు కూడా దృఢపడతాయి. కాబట్టి తప్పకుండా ఎముకలు, పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
తాజా క్యారెట్ రసం తాగడం వల్ల కూడా సులభంగా యూరిక్ యాసిడ్‌ను సులభంగా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది వ్యాధికి దివ్యౌషధంగా పని చేస్తుంది. కాబట్టి సులభంగా యూరిక్ యాసిడ్‌ను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రసం ప్రతి రోజూ తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగపడుతుంది. అంతేకాకుండా చర్మ, జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు
Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook