Turmeric Benefits: మెరుగైన ఆరోగ్యం కోసం ప్రకృతిలో అద్భుతమైన ఔషధాలున్నాయి. అందులో కీలకమైంది, విలువైంది పసుపు. పసుపు వినియోగంతో పురుషులకు అధిక ప్రయోజనాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రకృతిలో లభించే వివిధ రకాల ఔషధాల్లో పసుపు ఒకటి. భారతీయుల ప్రతి వంటలో తప్పకుండా వినియోగించేది పసుపు. ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు విషయంలో జరిపిన ఎన్నో అధ్యయనాల్లో అద్భుతమైన లాభాలు వెలుగుచూశాయి. వివిధ రకాల రోగాల్ని దూరం చేయడంలో పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంటల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో పసుపు వినియోగం పురుషులకు సంబంధించిన చాలా సమస్యలు దూరమౌతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
సాధారణంగా పురుషులు పగలంతా పనిచేస్తుంటారు లేదా ఎక్సర్సైజ్, ఆటలు, రన్నింగ్ వంటివాటితో శరీరంలోని మాంసకృతులు అలసిపోతుంటాయి. తీవ్రమైన నొప్పులతో బాధపడుతుంటారు. కండరాల పట్టేయడం, నొప్పులు బాధిస్తుంటాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు రాత్రి పూట పడుకునేముందు...కొద్దిగా పసుపు కలిపిన పాలను తాగితే హాయిగా ఉంటుంది. నొప్పులు దూరమౌతాయి. మగవారి చర్మ సంబంధిత సమస్యలకు కూడా పసుపు పరిష్కారం. మహిళలతో పోలిస్తే పురుషుల చర్మం కాస్త దళసరిగా ఉండటం వల్ల చర్మ రంధ్రాలు కూడా పెద్దవిగా ఉంటాయి. ఫలితంగా సీబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఆయిలీ స్కిన్‌కు దారి తీస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చర్మంపై పుసపు ప్యాక్ రాసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా స్వెల్లింగ్ వంటి సమస్య తగ్గిపోతుంది.
పసుపు కేవలం యాంటీ బ్యాక్టీరియల్గానే కాకుండా అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. అనేక వైరల్ వ్యాధుల్ని దరిచేరకుండా కాపాడుతుంది.
Also read: Curd Benefits: పెరుగు రోజూ తింటే..అన్ని సమస్యలు దూరం, బరువు తగ్గడంలో కీలకపాత్ర
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook