Uric Acid: అధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని కారణంగా చాలా రకాల నొప్పుల సమస్యలు వస్తున్నాయి. అయితే వీటిని ఇంటి చిట్కాల ద్వారా సులభంగా విముక్తి పొందవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఈ నొప్పుల నుంచి వంటగదిలో లభించే సుగంధ ద్రవ్యమైన పసుపును ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు.
పసుపులో ఉండే గుణాలు యూరిక్ యాసిడ్‌ని నియంత్రిస్తుంది:
పసుపులో చాలా రకాల ఔషద గుణాలున్నాయి. ఇది శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా బాడీని ఫిట్‌గా ఉంచేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా శరీరంలో పెరిగే యూరిక్ యాసిడ్ పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
పసుపు వల్ల శరీరానికి చాలా లాభాలు:
మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు బ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల మైగ్రేన్ సమస్య కూడా దూరమవుతాయి. ఇందులో చాలా రకాల పోషక విలువలుంటాయి. ఇవి పొట్టకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కడుపు సంబంధిత సమస్య ఉంటే ఖచ్చితంగా దీనిని వాడాలని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Neem Leaves Benefits: వేప ఆకుల వల్ల చర్మ సమస్యలు మటు మాయం.. క్రమం తప్పకుండా ఇలా చేయండి..!
Also Read: Neem Leaves Benefits: వేప వల్ల శరీరానికి కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook